రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి చిత్ర విడుదలకు ముందే సినిమా టికెట్లు బ్లాక్ గా విక్రయించేస్తున్నారు. ఆన్ లైన్ లో టికెట్లు దొరక్క టికెట్ల కోసం ఎదురు చూస్తున్న వారిని క్యాష్ చేసుకుంటున్నారు బ్లాక్ టికెట్ దందాదారులు.
తాజాగా కూకట్ పల్లి విశ్వనాథ్ థియేటర్లో 700 టికెట్లను టికెట్ కు 2 వేల చొప్పున అమ్మతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సినిమా రిలీజ్ కు మూడు రోజుల ముందే సినిమా టికెట్లు వీరి చేతికి ఎలా వచ్చాయ్, ఒకటో రెండో టికెట్లు కాదు ఏకంగా 700 టికెట్లు వారికి ఎలా వచ్చాయ్ అనే కోణం లో పోలీసులు విచారణ ను చేపట్టారు. అయితే థియేటర్ యాజమాన్యమే 700 టికెట్లను అందులో పనిచేసే వారికి ఇచ్చి ఇలా బ్లాక్ గా అమ్మిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయ్.
బాహుబలి సినిమా చూడాలన్న అభిమానుల ఇంట్రస్ట్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్న వారు ఇలా అడ్డదారులకు తెరతీసారు. వెలుగులోకి రాకుండా ఇంకా బాహుబలి టికెట్ ధర నాలుగంకెల దాకా పలుకుతుందట!
CLICK: డిసెంబర్ లో ప్రభాస్ పెళ్లి?