ఏడాదిలో 36 KG లు త‌గ్గిన BJP MLA అంటూ…వైర‌ల్ అవుతున్న వార్త వెన‌క దాగున్న అస‌లు నిజం.!!

నేడు సోష‌ల్ మీడియా ఎలా త‌యారైందంటే వైర‌ల్ అంటూ అందులో వ‌చ్చే ఏ వార్త‌ల‌ను నిజ‌మ‌ని న‌మ్మ‌లేక‌పోతున్నాం. ఏది నిజ‌మో, ఏది అబద్ద‌మో తెలియ‌డం లేదు. అంత‌లా కొంద‌రు సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌ల‌ను వైర‌ల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఓ వార్త కూడా అలాంటి కోవ‌కే చెందుతుంది. అంటే అందులో ఎంత మాత్రం నిజం లేదు. కానీ కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని మ‌రీ దాన్ని ఇటీవ‌లి కాలంలో వైర‌ల్ చేస్తున్నారు. ఇంత‌కీ వార్త ఏమిటో తెలుసా..? ఏమీ లేదండీ… అస్సాంకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అంగూర్‌ల‌త దేకా తెలుసు క‌దా. ఆమె గురించిన ఓ వార్తే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అమె ఒక‌ప్పుడు సినిమాల్లో న‌టించింది. అయితే ఎమ్మెల్యే అయ్యాక బ‌రువు పెరిగిందని, దీంతో ఏడాదిలోనే ఏకంగా 36 కిలోల వ‌ర‌కు బ‌రువు త‌గ్గింది చూడండి… అంటూ కొంద‌రు నిజంగా ఆమె ఫొటోలే అనిపించేలా వేరే మ‌హిళ ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి కొన్ని ఫొటోల‌ను, వాటితో వీడియోల‌ను క్రియేట్ చేసి నెట్‌లోకి వ‌దిలారు. దీంతో అవిప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.

నిజానికి నెట్‌లో వైర‌ల్ అయిన ఫొటోలు అంగూర్‌ల‌త‌వి కావు. వేరే మ‌హిళ‌వి. ఆమె పేరు సప్నా వ్యాస్ ప‌టేల్. ప్ర‌ఖ్యాత మోడ‌ల్‌. ఫిట్‌నెస్ నిపుణురాలు. న్యూట్రిష‌న్ సైన్స్‌లో ఈమె పీహెచ్‌డీ కూడా చేసింది. అయితే ఈమె ఒక‌ప్పుడు అధికంగా బరువుండేది. దీంతో ఆమె ఎంతో క‌ష్ట‌ప‌డి ఏడాదిలోనే 36 కిలోల వ‌ర‌కు బ‌రువు త‌గ్గగా అందుకు ఆమెకు చాలా మంది నుంచి అభినంద‌న‌లు, ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. ఈ క్రమంలో ఆమె జిమ్‌లో వ్యాయామం చేస్తున్న ఫొటోల‌ను మార్ఫింగ్ చేశారు కొంద‌రు.

అంతేకాదు, అలా మార్ఫింగ్ చేసిన ఫొటోల‌తో ఏకంగా వీడియోల‌ను కూడా క్రియేట్ చేశారు. ఆ ఫొటోలు, వీడియోల్లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే అంగూర్‌ల‌త అంటూ నెట్‌లో వాటిని విడుద‌ల చేశారు. దీంతో అవి వైర‌ల్ అయ్యాయి. అయితే ఆ ఫొటోలు, వీడియోల్లో ఉన్న‌ది మాత్రం సప్నాయే. బ‌రువు త‌గ్గింది కూడా ఆమే. అంగూర్‌ల‌త కాదు. కానీ నిజంగానే ఎమ్మెల్యే అంగూర్‌ల‌త బ‌రువు త‌గ్గింద‌ని, ఆమె హాట్ ఫొటోలు ఇవి అంటూ నెట్‌లో కొంద‌రు వాటిని వైర‌ల్ చేస్తున్నారు. చూశారుగా… మ‌నం వైర‌ల్ అంటూ న‌మ్మే వార్త‌ల్లో కొన్ని ఇలాంటివి కూడా ఉంటాయి. క‌నుక అలాంటి వైర‌ల్ వార్త‌ల‌ను న‌మ్మే ముందు ఒక‌టి రెండు సార్లు చెక్ చేసుకోవ‌డం మంచిది..!

Comments

comments

Share this post

scroll to top