13 ఏళ్ల కొడుక్కి బ‌ర్త్ డే గిఫ్ట్‌గా బెంజ్ కార్ ఇచ్చిన ఎమ్మెల్యే..!

అప్పుడే 19 రోజులు గ‌డిచిపోయింది, పాత 500, 1000 రూపాయ‌ల నోట్ల‌ను ర‌ద్దు చేసి. కానీ ఇప్ప‌టికీ జ‌నాల క‌ష్టాలు మాత్రం ఆగ‌లేదు. అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మ‌రో వైపు బడాబాబులు మాత్రం అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లిళ్లు, ఇత‌ర శుభ కార్యాలు చేసుకుంటూనే ఉన్నారు. ఎలాంటి చీకూ చింతా లేకుండా..! మొన్నా మ‌ధ్య రూ.500 కోట్ల ఖ‌ర్చుతో గాలి పెళ్లి వైభోగం చూశారుగా..! అది మ‌రువ‌క ముందే ఓ ఎమ్మెల్యే చేసిన ప‌ని నెటిజన్ల‌కు తీవ్రంగా కోపం తెప్పించింది. అదేమిటంటే…

bjp-mla-car-gift

మ‌హారాష్ట్ర‌కు చెందిన ఎమ్మెల్యే రామ్ క‌ద‌మ్ త‌న 13 ఏళ్ల కొడుకుకి ఇటీవ‌లే బ‌ర్త్ డే కానుక‌గా అత్యంత విలువైన మెర్సిడెస్ బెంజ్ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే అంత‌టితో అత‌ను ఆగ‌లేదు. స‌ద‌రు విష‌యాన్ని చెబుతూ త‌న కొడుకు, త‌న‌చ్చిన కార్‌తో కూడిన ఓ ఫొటోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశాడు. దీనిపై నెటిజ‌న్లు తీవ్రంగా మండిప‌డ్డారు. అందులో కొంద‌రి అభిప్రాయాలివి..!

twitter-comments-ram-mla

చూసేందుకు అత‌ను 18 ఏళ్ల‌లా లేడు. త‌క్కువ వ‌యస్సే ఉంటుంది. అంత‌టి ల‌గ్జ‌రీ కార్ అత‌నికి అవ‌స‌ర‌మా..? అస‌లు నీకు అంత‌టి ఆదాయం ఎక్క‌డి నుంచి వ‌స్తోంది? అది బ్లాక్ మ‌నీయా?
– ఓ ట్విట్ట‌ర్ యూజర్

అది ఓ విలాస‌వంత‌మైన కార్‌! బొమ్మ కారు కాదు. దాంతో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే ప్రాణాలు తీస్తుంది. జాగ్ర‌త్త‌..!
– జాసుమ‌తి ప‌టేల్

స‌ర్‌… మీ ద‌గ్గర ఎంత బ్లాక్ మ‌నీ ఉంది..?
– అభిషేక్ ఝా

30 శాతం ఆదాయ‌పు ప‌న్ను క‌డుతున్న నాకు ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం మారుతీ కారు కూడా లేదు. అలాంటిది నీ కొడుక్కి బెంజ్ కారా..? మీ ఎమ్మెల్యేల శాల‌రీ తిప్పి కొడితే ఎంత ఉంటుంది..?
– హ‌ర్ష్

 

ram-kadam-luxurious

చూశారుగా..! ట్విట్ట‌ర్‌లో నెటిజ‌న్లు ఎమ్మెల్యే రామ్ క‌ద‌మ్‌పై ఏ విధంగా విరుచుకు ప‌డుతున్నారో..! అయినా డ‌బ్బున్న వాళ్ల‌కు ఇవ‌న్నీ విన‌ప‌డ‌తాయా ఏంటి..? అదీ రాజ‌కీయ నాయ‌కుల‌కు..! అన్నట్టు, ఇంకో విష‌యం. ఈ రామ్ క‌ద‌న్ కు ఇంకో మంచి అల‌వాటు కూడా ఉందండోయ్‌. అదే ప్ర‌పంచ దేశాల‌కు టూర్లు వేయ‌డం..! మోదీగారిని ఫాలో అవుతున్నారో, లేదంటే నిజంగానే టూర్ల‌పై మక్కువో తెలియ‌దు. కానీ ఎప్పుడూ టూర్ల‌లోనే ఉంటార‌ట‌. ఇది కాకుండా ఇంకో విషయం ఏమిటంటే… ఆయ‌న ద‌గ్గ‌ర చాలా విలాస‌వంత‌మైన ల‌గ్జ‌రీ కారు ఇంకా చాలానే ఉన్నాయ‌ట‌.!? మ‌రి వాటికి డ‌బ్బులు ఎలా వ‌చ్చాయి చెప్మా.!? ఏమో స‌మాధానం మీకు ఇప్ప‌టికే త‌ట్టే ఉంటుంది..!

Comments

comments

Share this post

scroll to top