ఆమె అందం పైనే పొలిటికల్ లీడర్ ల చర్చ.. రాజకీయాల్లో కొత్త మలుపు.?

జాతీయ రాజకీయాల్లో ప్రియాంక గాంధీ ఆరంగేట్రం తరువాత అంతా తారు మారు అయిపోయింది, కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీలన్ని వ్యూహ రచనల నుండి, మాటల వరకు అనుకోని మార్పులు వచ్చాయి, ప్రియాంక గాంధీ ఆరంగేట్రం తరువాత కాంగ్రెస్ నాయకులకు కొత్త జోష్ వచ్చింది, ఆ నాడు ఇందిరా గాంధీ రాకతో కాంగ్రెస్ దశ ఎలాగైతే తిరిగిందో, ఈనాడు ప్రియాంక గాంధీ ఎంట్రీ తో కాంగ్రెస్ పూర్వ వైభవం దక్కించుకుంటుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

అందమే.

అయితే ప్రియాంక గాంధీ గారి అందం గురుంచి ప్రత్యర్థి పార్టీ నేతలు కామెంట్స్ చెయ్యడం మొదలెట్టారు, రాజకీయాలు అన్నాక ఇలాంటివి మామూలే. కానీ సొంత కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ప్రియాంక గాంధీ అందం మీద కామెంట్స్ చెయ్యడం అనేది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది, మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి సజ్జన్ సింగ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ : “బీజేపీలో ప్రియాంక లాంటి అందెగత్తెలు లేరని. అది వారి దురదృష్టం. బీజేపీకి ఉన్నది కేవలం హేమమాలిని మాత్రమేనని, ఆమె చేసే సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించి బీజేపీ వాళ్లు ఓట్లడుక్కోవాల్సిందేనని. ప్రియాంకను అందంగా సృష్టించినందుకు దేవుడికి కృతజ్ఞతలు. ప్రజల పట్ల ఆమెకున్న గౌరవం ప్రేమను ఆమె సౌందర్యం ప్రతిబింబిస్తుంది. బీజేపీ నేతలు ఆమె అందంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తమ స్థాయిని దిగజార్చుకోవద్దు” అని సజ్జన్ సింగ్ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. ప్రస్తుతం సజ్జన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

కారణం బీజేపీ నాయకులే… :

కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ సింగ్ అలా మాట్లాడటానికి కారణం బీజేపీ నేతలే అని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు, పదే పదే బీజేపీ నాయకులు ప్రియాంక గాంధీ అందం పైన విమర్శలు చేస్తుండటం తో ఆయన అలా మాట్లాడాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇక ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా ప్రియాంక గాంధీ పై సెటైర్ వేశారు.” ప్రియాంక గాంధీ ‘బైపోలార్ డిజార్డర్’ అనే రుగ్మతతో బాధపడుతున్నారని, ఇది ఆమె హింసాత్మక స్వభావాన్ని తెలియజేస్తోందంటూ” సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రియాంక గాంధీ అందం పైన కామెంట్స్ చేస్తుండటం తో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

 

Comments

comments

Share this post

scroll to top