జబర్ధస్త్ ను భయపెడుతున్న బిత్తిరిసత్తి.!

జబర్దస్త్ ….పరిచయం చేయాల్సిన అవసరం లేని ఖతర్నాక్ కామెడీ షో…. టివీ రంగాన్ని ఓ ఊపు ఊపిన కార్యక్రమం అది. యాంకర్లతో సహా ఆర్టిస్టుల ఫేట్ ను మార్చిన ప్రోగ్రామ్ అది. ఇప్పుడు వాళ్లంతా చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది మొదలు ఎండింగ్ వరకు కామెడీ పంచ్ లతో కడుపుబ్బా నవ్విస్తూ కొద్ది కాలంలోనే అందరి ఫేవరెట్ షో గా మారిపోయింది. ఇక యూట్యూబ్ లో ఈ వీడియోస్ చూసేవారి సంఖ్య అయితే లెక్కేలేదు. అలా అప్రతిహతంగా  సాగుతున్న  ప్రొగ్రామ్ పై ఈ మద్యకాలంలో సెటైర్లు ఎక్కువయ్యాయ్… కామెడీకి పేరుతో టన్నుల కొద్ది అడల్ట్ కామెడీని కుమ్మరిస్తున్నారని..యాంకరమ్మ హొయలు చూడలేక పోతున్నామని .గతంలో ఫ్యామిలీతో చూస్తూ హాయిగా నవ్వుకున్న మేము…అదే ప్రోగ్రామ్ ను ఫ్యామిలీతో చూడలేకపోతున్నామనే కంప్లైంట్ లు ఎక్కువయ్యాయ్.

అనేక కారణాలు వల్ల జబర్దస్త్  నుండి జనాలు…V6 తీన్మార్ కు మైగ్రేట్ అవుతున్నారు. రెండింటిని పోల్చి చూసుకుంటు….తీన్మార్ కు, అందులోని బిత్తిరి సత్తి పెట్టే గిల్లికజ్జాలకే మా ఓటు అంటు తీన్మార్ న్యూస్ కు పట్టం కడుతున్నారు. అడల్ట్ కామెడీకి బదులు …వినోదము + విజ్ఞానాన్ని అందించే  సత్తి ఫన్ యే  బెటర్ అనే ఫీలింగ్ ఉన్నారు జనాలు..అందుకే తనదైన యాసతో , అమాయకత్వ వదనంతో, తనకు తెలిసిన చిన్నపాటి లాజిక్స్  ను రేజ్ చేస్తూ, చూడగానే నవ్వు తెప్పించే ఎక్స్ ప్రెషన్స్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు బిత్తిరి సత్తి. అందుకే ఇప్పుడందరూ జబర్దస్త్ ను బంద్ పెట్టి సత్తి వైపుకు మొగ్గుతున్నారట… 9.30 అయితే చాలు రిమోట్స్ అన్ని తీన్మార్ వైపు,  కండ్లన్నీ బిత్తిరి సత్తి వైపుకు మల్లుతున్నాయట.!

bititiri-horz

యూట్యూబ్ లో కూడా బిత్తిరి సత్తి హడావుడి అంతా ఇంతా కాదు..వీడియో అప్ లోడ్ చేసిన ఒక్కరోజుకే దాదాపు 2 లక్షల హిట్ ను సంపాదిస్తున్నాయి. కేవలం కామెడీయే కాకుండ  లోకంలో జరుగుతున్న విషయాన్ని కూడా ఫన్ టచ్ తో ఫెంటాస్టిక్ గా ప్రజెంట్ చేస్తూ దూసుకుపోతున్నాడు బిత్తిరి సత్తి. అందుకే కామెడీ పేరుతో ఇప్పుడు జబర్థస్త్ ను బిత్తిరి భయపెడుతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్.

 

అవార్డ్ రేసులో పరుగులు పెడతున్న బిత్తిరి సత్తి.:

CfA87EsUYAA9ppR

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రోజైన జూన్ 2 న, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అవార్డులు ఇవ్వనుందట…అందులో కామెడీ రంగంలో బిత్తిరి సత్తికి ఇవ్వాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందట.!  తన కామెడీతో తెలంగాణ యాసను కాపాడుతూ,  తెలంగాణ మనుషుల భోలా  తనాన్ని  ప్రతిబింబిస్తూ, నవ్విస్తూ విషయాన్ని కూడా అందిస్తున్న బిత్తిరి సత్తి అవార్డ్ కు 100 శాతం అర్హుడంటున్నారు జనాలు.

#ఆల్ ది బెస్ట్ బిత్తిరి సత్తి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top