ఇతడు కొరికితే చాలు పిల్లలు పుట్టేస్తారట ఎక్కడో తెలుసా.??

కొన్నివింత విషయాలు మన చెవిలో పడితే, ఏంది రా సామి ఇది అని అనుకుంటాం, ఆ కోవలోకే ఈ బాబా కూడా చేరుతాడు. ఇతగాడు కొరికితే పిల్లలు పుడతారంట, ఒకప్పుడు చేత్తో ముడితే, కాలితో తంతే పిల్లలు పుడతారు అది ఇది అని వినేవాళ్ళం, స్మార్ట్ ఫోన్ లు మరియు సోషల్ మీడియా ఊపందుకున్నాక ఇలాంటి మూఢ నమ్మకాలు మొనగ పాలయ్యాయి, కానీ ఇప్పటికీ కొన్ని చోట్ల కంత్రి బాబా లను నమ్మే జనాలు ఉన్నారని ఇతగాడు నిరూపించాడు. పిల్లలు పుట్టక పోయినా, గాలి, ధూలీ సోకినా, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నా వెంటనే తీర్చేస్తాడట. అయితే, ఇందుకు భక్తులు అతనితో కరిపించుకోవాలి. ‘‘మీ శరీరంపై నా పంటి గాటు పడితే చాలు, మీ సమస్యలన్నీ తీరుపోతాయి’’ అంటూ భక్తులను మోసం చేస్తున్నాడు ఈ బాబా. ఇతగాడికి మాయలు తెలీవు మంత్రాలు రావు, కానీ ఇతనికి తెలిసింది ఒకటే, కొరకడం. కొరికితే సమస్యలు ఎలా తీరుతాయో కొరికించుకొనే వాళ్ళకే తెలియాలి.

సినిమాల్లో అయినా.. :

ఇలాంటి బాబా లను కాంచన లాంటి సినిమాల్లో తీసుకొని దెయ్యాలని కొరికించకన్నా పోతిరి, దెయ్యాలని కొరికితే దెయ్యం దెబ్బకు వినిగిపోద్ది అని చెప్పలేదు ఇంకా.. ఇలాగే వదిలేస్తే అది కూడా చెప్తాడేమో, దైవ భక్తి ఉండటం లో తప్పు లేదు, మూఢ నమ్మకం కలిగిన భక్తి అనవసరం. ఇకపైన అయినా ఇలాంటి బాబా లకు దూరంగా, మంచి చేసే మార్గానికి దెగ్గరగా నడవండి.

Watch Video:

 

Comments

comments

Share this post

scroll to top