మైక్రోసాఫ్ట్ అధినేత “బిల్‌గేట్స్” కూతురి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.? చూస్తే ఫిదా అవుతారు.!

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ గురించి మ‌నంద‌రికీ తెలుసు. ప్ర‌పంచంలోని ధ‌న‌వంతుల్లో ఈయ‌న కూడా ఒక‌రు. ఎంత ధ‌న‌వంతుడు అయిన‌ప్ప‌టికీ ఈయ‌న చాలా సింపుల్‌గా ఉంటారు. అదే సింప్లిసిటీ ఆయ‌న కూతురు జెన్నిఫ‌ర్ కాథ‌రిన్ గేట్స్‌కు కూడా వ‌చ్చింద‌నే చెప్ప‌వ‌చ్చు. సాధార‌ణంగా పేరుమోసిన వ్యాపార‌వేత్త‌లు, పారిశ్రామిక వేత్త‌ల పిల్ల‌లు అంటే వారు ఎప్పుడూ విలాసాల్లో మునిగి తేలుతుంటారు. ఎక్క‌డ చూసినా వారే క‌నిపిస్తారు. ఇంట్లో ఉన్నా, బ‌య‌టికి వెళ్లినా వారికి ల‌భించే స‌దుపాయాలు, ల‌గ్జ‌రీ అంతా ఇంతా కాదు. కానీ బిల్ గేట్స్ కూతురు కాథ‌రిన్ విష‌యానికి వ‌స్తే మాత్రం ఆమె సింపుల్‌గా ఉంటుంద‌నే అన‌వ‌చ్చు.

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌, ఆయ‌న భార్య మెలిండా గేట్స్‌ల గారాల ప‌ట్టి జెన్నిఫ‌ర్ కాథ‌రిన్ గేట్స్‌కు ఇప్పుడు 21 సంవ‌త్స‌రాలు. అయితే తండ్రి బిల్‌గేట్స్ ఆమెకు ఇప్ప‌టికే రెంట్‌ను ఇచ్చే ఎన్నో ప్రాప‌ర్టీల‌తోపాటు ప‌లు హార్స్ ఎస్టేట్‌ల‌ను కూడా కాథ‌రిన్‌కు కొనిచ్చాడు. ఎందుకంటే ఆమెకు హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఇక ఆమె ఎలాంటి లగ్జ‌రీకి పోదు. ఉన్నంతలో త‌న తండ్రిలాగే సింపుల్‌గా ఉంటుంది. ఈమె స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీలో బ‌యాల‌జీ చ‌దువుతోంది.

ఇక కాథ‌రిన్ గేట్స్ ఈ మ‌ధ్యే న‌యెల్ నాసర్ అనే వ్య‌క్తితో డేటింగ్ చేస్తోంది. త్వ‌ర‌లో అత‌న్ని పెళ్లి కూడా చేసుకోనుంద‌ని తెలిసింది. మ‌రి దీన్ని బిల్ గేట్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియ‌దు కానీ.. అత్యంత సంప‌న్నురాలైన ఆమె మాత్రం ఎప్పుడూ త‌న సొంత ప‌నుల్లోనే బిజీగా ఉంటుంది త‌ప్ప ఎక్క‌డ కూడా విలాసాలాకు పోదు. ఉన్నంత‌లో సాధార‌ణంగానే ఉంటుంది. ఆమెను చూస్తే ధ‌న‌వంతుల బిడ్డ అని కూడా ఎవ‌రూ అనుకోరు. ఇక త‌న ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లోనూ ఆమె త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించిన ఫొటోల‌ను పెడుతుంది. వాటిని చూస్తే చాలు మ‌న‌కు ఆమె సింప్లిసిటీ ఏమిటో తెలుస్తుంది. ఏది ఏమైనా కాథ‌రిన్ ఇలా సింపుల్‌గా ఉండ‌డాన్ని అభినందించాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top