అది దేశ వాణిజ్య నగరం ముంబాయ్ లోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ రోడ్డు. చాలా మంది కాలేజ్ కుర్రాళ్ళు అక్కడ గుమ్మిగూడారు. అక్కడంతా కోలాహలంగా ఉంది. లక్షల డబ్బులు చేతులు మారుతున్నాయ్. కుర్రాళ్ళంతా బ్యాచ్ లు బ్యాచ్లు గా ఉన్నారు. అంతలోనే అదే రోడ్డు మీద స్పోర్ట్స్ బైక్స్ రయ్ అంటూ దూసుకుపోతున్నాయ్. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా రయ్ మంటూ దూసుకెళుతున్న వారిని మరింతగా చీర్ అప్ చేస్తున్నారు. రయ్ రయ్ అనే శబ్దాలతో ఆ ప్రాంతం అంతా ప్రతిధ్వనిస్తుంది. అంతలోనే ఓ బైక్ మెరుపు వేగంతో ముందుకు దూసుకొస్తుంది…. అలా వేగంగా వచ్చిన బైక్ దానికి ముందున్న కార్ ను ఢీ కొట్టి, కింద పడింది…దాని వెను వస్తున్న మరో మూడు బైక్స్ కూడా దానికి గుద్దుకొని బోల్తా పడ్డాయ్…. అలా పడిన బైక్స్ వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక అలాగే రోడ్డు మీద 100 మీటర్ల మేరకు దొర్లుకుంటూ పోయాయ్.ఈ ఘటన లో నలుగురు యువకులు దుర్మరణం చెందారు. ఇది అక్కడ దొంగచాటుగా జరుగుతున్న బైక్ రేసింగ్ మిగిల్చిన విషాదం.