పిల్లలు పుట్టలేదని బ్రతికుండగానే చితి పేర్చి చంపే…

మన దేశం లో మూఢనమ్మకాలకు లోటు లేదు, అసలు ఏ విషయం జరిగినా దాని వెనకాల ఏదో ఉందని భయపడే మంది చాలా ఎక్కువ. ముఖ్యంగా కొన్ని పద్ధతులు ఇప్పటికి మారలేదు, ఒకప్పుడు భర్త చనిపోతే భర్త తో పాటే భార్యను కూడా చంపేసేవారు, భర్త చితి మంటల్లో భార్యను సాగనంపేవారు, అలాగే పెళ్లయ్యాక అమ్మాయికి పిల్లలు పుట్టకపోతే ఆమెను ఆమె కుటుంబ సభ్యులే సజీవ దహనం చేసేవారని ఒకప్పుడు విన్నాం, కానీ ఆ మూఢ నమ్మకాన్ని నిజం చేసారు బీహార్ లో ఒక ప్రాంతానికి చెందిన కుటుంబం.

వివరాల్లోకెళితే, బీహార్ రాష్ట్రం భోజ్‌పూర్‌లోని సారికపూర్ స్మశానవాటికలో ఓ మహిళకు చితి పేర్చారు పెళ్లయి చాన్నాళ్లయినా పిల్లలు పుట్టలేదంటూ ఆమెను సజీవ దహనం చేయడానికి ప్రయత్నించారు కుటుంబసభ్యులు. కట్టెలు కూడా అమర్చారు. కానీ ఆ మహిళ మృతిచెందలేదు. బతికుండగానే ఆమెను సజీవ దహనం చేసేందుకు కుటుంబసభ్యులే సిద్ధమయ్యారు.

ఆ మహిళ కు ఎటువంటి ప్రమాదం జరగలేదు.

అయితే అదృష్టవశాత్తు ఒక గుర్తుతెలియని వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది, సమయానికి పోలీసులు రావడం తో ఆ మహిళ ను కాపాడగలిగారు, పోలీసులు వచ్చే సరికి ఆమె కట్టెలపైనా పడుకొని ఉంది, ఆమె బ్రతికి ఉండటం తో పోలీసులు ఆమెను ఆసుపత్రి కి తీసుకువెళ్లి చికిత్స అందించారు, ప్రస్తుతం ఆ మహిళ కు ఎటువంటి ప్రమాదం లేదు అని పోలీసులు తెలిపారు.

ఈ కాలం లో కూడా.?

అయితే ఈ కాలం లో కూడా ఇలా ప్రవర్తించే మానవ మృగాలు ఉంటారా అని చాలా మందికి అనుమానం రావొచ్చు, కానీ మన దేశం లో ప్రతి రోజు ఏదో ఒక మూలన ఇలా మూఢనమ్మకాల వల్ల అమాయకుల ప్రాణాలను అన్యాయంగా బలిగొంటున్నారు. ఈ మూఢనమ్మకాలు ఎప్పుడు ఆంతరిస్తాయో మన దేశం లో..

టెక్నాలజీ.. :

అయితే రానున్న తరాలు మాత్రం టెక్నాలజీ తో నిండిపోనుందని స్పష్టంగా అర్ధం అవుతుంది. ఇప్పుడు పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో కూడా స్మార్ట్ ఫోన్ లు, ఫాస్ట్ ఇంటర్నెట్ సౌకర్యాలు లభిస్తున్నాయి, రానున్న రోజుల్లో జనాలు మరింత మారే అవకాశం ఉంది. భారతదేశ నలుమూలల మూఢనమ్మకాలు తొలగి పోవాలని చాలా మంది ఆశిస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top