బిగ్ బాస్ 2 తెలుగు: హీరో తరుణ్, సింగర్ గీతా మాధురి… ఇంకా ఎవరంటే?

ఎన్నో  విమర్శల నడుమ మొదలై  ,అత్యధిక టిఆర్పీ తో దూసుకుపోతూ విజయవంతంగా ముగిసింది బిగ్ బాస్ షో…బిగ్ బాస్ షో విజయంలో సింహభాగం హోస్ట్ ఎన్టీయారే కే దక్కాలి.మొదటినుండి కంటెస్టంట్స్ విషయంలో కొంచెం అయిష్టంగా ఉన్నప్పటికి ఎన్టీయార్ ఎపిసోడ్స్ మాత్రం ఆసక్తిగా చూసేవారు..చివరి రోజు ఎన్టీయార్ మాటలు కూడా తనెంతగా బుల్లితెర ప్రేక్షకులకు కనెక్టయింది తెలిపాయి..ఇప్పుడు బిగ్ బాస్ 2 సిద్దమవుతుంది..మరి ఈ షోకి హోస్ట్ ఎవరూ..కంటెస్టంట్స్ ఎవరూ అనే విషయాల గురించి కొన్ని వివరాలు..

 నేచురల్ స్టార్ నానీ…

యంగ్ టైగర్ ఎన్టీయార్ వరుస హిట్లతో దూసుకుపోతూ..ఇప్పుడు  మరో రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు .ఒకటి త్రివిక్రమ్ ది,మరొకటి రాజమౌలిది..ఈ  సినిమాలతో ఉన్న ఎన్టీయార్ సీజన్ 2 హోస్ట్ చేసే పరిస్థితి కనపడట్లేదు.కాబట్టి నేచురల్ స్టార్ నాని అయితే బాగుంటుందని నిర్వాహకులు నానిని సంప్రదించడం,ఒప్పించడం జరిగింది.కొన్ని రోజుల్లో నానితో బిగ్ బాస్ 2 తెలుగు ప్రోమో విడుదల చేసి ప్రమోషన్స్ నిర్వహించనున్నారు.ఇప్పటికే నాని అటు క్లాస్,ఇటు మాస్ ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్నాడు..బిగ్ బాస్ 2తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాడనడంలో సందేహం లేదు..

లవర్ బాయ్ తరుణ్

గత సీజన్లో హీరో నవదీప్ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని సందడి చేశారు. ఈ సారి టాలీవుడ్లో లవర్ బాయ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో తరుణ్ ఈ షోలో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు.

సింగర్ గీతామాధురి

యంగ్ జనరేషన్ సింగర్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చున్న వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు గీతా మాధురి. ఈ సారి గీతా మాధురి ఈ షోలో హైలెట్ కాబోతుంది.

తేజస్వి

తన సెక్సీ అప్పియరెన్స్‌తో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తెలుగుమ్మాయి తేజస్వి మదివాడ ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లో ఎంటర్ కాబోతుంది.గతంలో బిగ్ బాస్ యాడ్లో  ఎన్టీయార్ పక్కన చీకట్లో ఇద్దరమ్మాయిలు నిల్చున్నట్టుగా చూపించేవారు.ఆ ఇద్దరమ్మాయిల్లో ఒకరు మధుషాలిని,మరొకరు తేజస్విని అనే వార్తలొచ్చాయి..ప్రోగ్రామ్ అయిపోయాక కూడా వారిద్దరెవరో రివీల్ చేయలేదు..ఈ సారి బిగ్ బాస్ షో లో కంటెస్టంట్ గా ఎంటర్టైన్ చేయబోతుంది.

సామాన్యులకు అవకాశం.

బిగ్ బాస్‌ 2లో కేవలం సెలబ్రిటీలకు మాత్రమే కాదు, సామాన్య ప్రజలకు కూడా అవకాశం కల్పించనున్నారు. సామాన్య ప్రజలు మే 15 వరకు తమ ఎంట్రీలు పంపించవచ్చు. మీ అదృష్టం బావుంటే మీరూ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం దక్కించుకోవచ్చు. ఇందుకోసం biggbosstelugu.startv.com వెబ్ సైట్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది.

సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 మొదటి దానికంటే పూర్తిగా భిన్నమైన లుక్‌తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించనుంది. షోకు సంబంధించి టైటిల్‌లోగో, బిగ్ బాస్ హౌస్ ప్రతి అంశంలో పూర్తిగా మార్పులు చేశారు. జూన్ నెల నుండి బిగ్ బాస్ 2కు సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లోగో రిలీజ్ చేయడం ద్వారా ఆల్రెడీ స్టార్ మా టీవీలో ప్రమోషన్స్ మొదలయ్యాయి.

Tweet:

Comments

comments

Share this post

scroll to top