`బిగ్‌బాస్‌-2` హోస్ట్ పారితోషికం ఎంతో తెలుసా?..?

హిందీ త‌ర‌హాలోనే తెలుగు బుల్లితెర మీద కూడా `బిగ్‌బాస్‌` రియాలిటీ షో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. దానికి ముఖ్య కార‌ణం ఆ షోకు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్ అనే సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో `బిగ్‌బాస్‌` రెండో సీజ‌న్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ సీజ‌న్‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్ అందుబాటులో ఉండ‌డం లేదు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, రాజ‌మౌళి వంటి ద‌ర్శ‌కుల‌తో వరుస సినిమాల‌తో ఎన్టీయార్ బిజీగా ఉండ‌డ‌మే దానికి కార‌ణం.


దీంతో రెండో సీజ‌న్‌కు హోస్ట్‌ను వెతికే ప‌నిలో ఉన్నార‌ట షో నిర్వాహ‌కులు. ఈ సీజ‌న్‌ను నేచుర‌ల్ స్టార్ నాని హోస్ట్ చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే నాని గ్రీన్‌సిగ్న‌ల్ కూడా ఇచ్చేశాడ‌ని అంటున్నారు. అయితే మొద‌టి సీజ‌న్‌తో పోల్చుకుంటే రెండో సీజ‌న్ వ్యాఖ్యాత‌కు పారితోషికం త‌గ్గుంతోంద‌ని వార్తలు వ‌స్తున్నాయి. మొద‌టి సీజ‌న్‌ను హోస్ట్ చేసినందుకు ఎన్టీయార్‌కు ఎనిమిది కోట్ల రూపాయ‌ల పారితోషికం ఇచ్చార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. రెండో సీజ‌న్‌ను హోస్ట్ చేస్తున్న నానికి ఐదు కోట్ల రూపాయ‌లు ఇవ్వ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

 

Comments

comments

Share this post

scroll to top