వారంలో 1000 కోట్లు కలెక్ట్ చేసి నెం. 1 గా నిలిచినా “బాహుబలి”కి పెద్ద నష్టం వాటిల్లింది..! ఎలాగో తెలుసా?

బాహుబలికి భారీ నష్టం ఏమిటి? వారం రోజుల్లో వెయ్యి కోట్లు వసూలు చేసి భారత సినీ పరిశ్రమ అగ్ర పీఠం ఎక్కింది కదా? ఏ భారత సినిమా కలెక్ట్ చేయనన్ని డబ్బులు కలెక్ట్ చేసింది బాహుబలి. మరి లాస్ ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఎన్నో సినిమాలు పైరసీ భారిన పడినట్టే బాహుబలి కూడా పైరసీ భారిన పడింది. సినిమా విడుదలకు ముందే నెట్ లో సినిమా హెచ్డీ ప్రింట్ లీక్ అయ్యింది. ఎన్నో సీడీలు కూడా అక్రమంగా విడుదలయ్యాయి. సైబర్ ఎంత ప్రయత్నించినా ఎంతో మంది అప్పటికే సినిమా డౌన్లోడ్ చేసేసుకున్నారు.

ఇటీవలే తమినాలనాడులో “విశాల్” ఈ విషయం పై స్పందించి వెంటనే దోషులను పట్టుకోవాలి అన్నారు. ఈ పైరసీ గనక లేకుండా ఉంటే ఇంకెక్కువ కలెక్షన్స్ వచ్చేవని “బాహుబలి” ప్రొడ్యూసర్స్ అంటున్నారు. పైరసీ వల్ల బాహుబలికి భారి నష్టం వచ్చిందని వారు పేర్కొంటున్నారు..! మరికొంతమంది అయితే ఏకంగా సినిమాను ఫేస్బుక్ లైవ్ లో పెట్టేసారు. ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన బాహుబలికి కూడా పైరసీ కష్టాలు తప్పలేదు మొత్తానికి. ఈ విషయంపై మీ స్పందన ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఏది ఏమైనా బాహుబలి సినిమా చూడాలంటే తప్పనిసరిగా థియేటర్ లోనే చూడాలి!

Comments

comments

Share this post

scroll to top