మా కుక్కకు పెళ్లి..మీరందరు తప్పకరండి.!

మా కుక్కకు పెళ్లి..మీరందరు తప్పకరండి.! అని ఆహ్వన పత్రిక పంపకం నుండి తాళి కట్టి, అప్పగింతల వరకు ఓ కుక్క పెళ్లి ఘనంగా జరిగింది. అది కూడా ఏదో తూతూ మంత్రంగా కాదు… అనేక మంది బంధువులు వచ్చి ఆశీర్వదిస్తుండగా…ఊరంతా బోజానాలు పెట్టి మరీ ఈ కుక్కల పెళ్లి వేడుకలు అంబరాన్నంటాయి.  ఆశ్చర్యంగా ఉందా? కుక్కల పెళ్లేంటి? అంగరంగ వైభవంగా ఏంటి? ఇక్కడ మా పెళ్లిళ్లే ఇంకా కాట్లేదని బ్యాచ్ లర్ బాబులు అసూయపడేలా..ఆ కుక్కల పెళ్లి  విశేషాలు మీకోసం.

కుక్కకున్న విశ్వాసం మనుషులకు కూడా ఉండదనేది మనకందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగా సొంత బిడ్డలా పెంపుడుకుక్క షాగుయానిని పెంచుకున్నాడు ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబి జిల్లాకు చెందిన వ్యక్తి. తన అన్ని అవసరాలలో చేదోడుగా ఉంటూ, తనపై ఎంతో ప్రేమ  చూపించే ఆ కుక్కకు, పక్క గ్రామంలో తోడుని చూశాడు. పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లకు ఎలాంటి పెళ్లికొడుకును తమ కూతురికి ఇచ్చి వివాహం చేయాలో అలానే అన్ని రకాలుగా ఆలోచించాడు ఆ యజమాని. పెళ్లి పత్రకలు అచ్చు వేయించాడు, బంధుగణాన్ని పెళ్లికి ఆహ్వానించాడు, ఎన్నో రకాల వంటకాలు పెళ్లి విందుగా చేయించాడు, అంగరంగ వైభవంగా పెళ్లి పందిరి వేయించాడు. తన పెంపుడు కుక్క షాగునియాకు పెళ్లి దుస్తులుగా పసుపు రంగు దుస్తులు, వరుడు షాగున్ కి గులాబీ రంగు దుస్తులు వేయించాడు. వేదమంత్రాలు, సన్నాయి డోలు బాజాల వాయిద్యాల మధ్య తాళి కట్టించి వివాహం చేయించాడు. కూతురు పుట్టింటి నుండి మెట్టిల్లుకు వెళ్ళేటప్పుడు అప్పగింతల సమయంలో వెళ్లిపోతున్న కూతురిని చూస్తూ కన్నీరు పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అలా తన కన్న కూతురిలా భావించే షాగునియా మెట్టింటికి వెళ్లిపోతుంటే ఆ యజమాని కన్నీరుమున్నీరయ్యాడు. ఈ పెళ్లి కార్యక్రమానికి దాదాపు 5 వేలమందికి పైగా హాజరయ్యారు. ఇక పెళ్లికుమార్తె పుట్టింటి నుండి అత్తారింటికి వెళ్తున్నప్పుడు ఒక మెరవనిలా ఆటపాటలతో ఊరేగింపుగా చేస్తూ మెట్టింటికి పంపించారు. ఆ కుక్క అక్కడి నుండి వెళ్లిపోతుంటే ప్రజలంతా కన్నీరుమున్నీరయ్యారు. కుక్క పేరుకే పెంపుడు జంతువైనా,వారందరి ప్రేమానురాగాలు పొందింది.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top