ఈ ఏడాది ఐపీఎల్ లో చేసిన ముఖ్య మార్పు ఏమిటో తెలుసా..? వివరాలు ఇవే.!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌.. ఐపీఎల్‌.. ఎలా ప‌లికినా స‌రే.. ఏడాదికొక‌సారి స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో వ‌చ్చే ఈ టోర్న‌మెంట్ కోసం భార‌త క్రికెట్ క్రీడా ప్రేమికులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. త‌మ అభిమాన ప్లేయ‌ర్లు, జ‌ట్లు గెల‌వాల‌ని కోరుకుంటారు. ఓ ర‌కంగా చెప్పాలంటే ఇండియ‌న్ క్రికెట్ టీం ఆడే మ్యాచ్‌ల‌కు ఏవిధంగా క్రేజ్ ఉంటుందో అంతే క్రేజ్ ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు కూడా ఉంటుంది. చాలా మంది స్టేడియాల్లోనే కాదు, టీవీల్లోనూ ఈ మ్యాచ్‌ల‌ను చూసేందుకు ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అయితే ఎప్ప‌టిలాగే ఈ ఏడాది ఐపీఎల్ కూడా వ‌చ్చేసింది. ఈ క్ర‌మంలోనే ఈ సారి ఈ టోర్న‌మెంట్‌లో ప‌లు ముఖ్య‌మైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. అవేమిటంటే…

అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల‌లో లేదు కానీ.. ఐపీఎల్ మ్యాచుల్లో మాత్రం స్ట్రాట‌జిక్ టైం అవుట్ అని కొత్త రూల్‌ను అమ‌లు చేస్తున్నారు తెలుసు క‌దా. దీని ప్ర‌కారం ఒక మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో రెండు సార్లు చొప్పున మొత్తం మ్యాచ్‌లో నాలుగు సార్లు ఈ టైం అవుట్‌ను అమ‌లు చేస్తారు. టైం అవుట్ తీసుకున్న‌ప్పుడ‌ల్లా ప్లేయ‌ర్ల‌కు రెండున్న‌ర నిమిషాల పాటు బ్రేక్ దొరుకుతుంది. ఒక ఇన్నింగ్స్‌లో బౌలింగ్ జ‌ట్టు 6 నుంచి 9 ఓవ‌ర్ల మ‌ధ్య టైం అవుట్ బ్రేక్ తీసుకుంటే మ‌రో జ‌ట్టు అదే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుంది క‌నుక వారు 13 నుంచి 16వ ఓవ‌ర్ లోపు టైం అవుట్ తీసుకుంటారు. తిరిగి మ‌ళ్లీ రెండో జ‌ట్టు ఇన్నింగ్స్ లోనూ ఇలాగే టైం అవుట్ తీసుకుంటారు. అలా మొత్తం మ్యాచ్‌లో నాలుగు సార్లు టైం అవుట్ తీసుకుంటారు.

అయితే ఐపీఎల్‌లో ఇలా టైం అవుట్ తీసుకున్న‌ప్పుడు అంపైర్లు ఆంగ్ల అక్ష‌రం ‘T’ ఆకారంలో సైగ చేస్తారు. అయితే మామూలుగా అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ల‌లో ఐపీఎల్‌లో ఉన్న‌ట్లుగా టైం అవుట్ లేదు. కానీ డీఆర్ఎస్ (డెసిష‌న్ రివ్యూ సిస్ట‌మ్‌) మాత్రం ఉంది. అంటే అంపైర్ ఇచ్చిన నిర్ణ‌యాన్ని ప్లేయ‌ర్లు చాలెంజ్ చేస్తార‌న్న‌మాట‌. ఆ క్ర‌మంలో ప్లేయ‌ర్లు ‘T’ ఆకారంలో సైగ చేస్తారు. అయితే ఈ సారి జ‌ర‌గ‌బోయే ఐపీఎల్‌లో టైం అవుట్‌కు తోడు తొలిసారిగా డీఆర్ఎస్‌ను ప్ర‌వేశ‌పెడుతున్నారు. ఈ క్ర‌మంలో రెండు సంద‌ర్భాల్లోనూ ‘T’ సైగ‌ను చూపించాల్సి ఉంటుంది. క‌నుక స‌ద‌రు ‘T’ సైగ టైం అవుట్‌కు సూచికా లేక డీఆర్ఎస్‌కు సూచికా అనేది తెలియక వీక్ష‌కులు, ప్లేయ‌ర్లు ఇబ్బందులు ప‌డతారు. క‌నుక ఈ అయోమ‌యం లేకుండా ఉండేందుకు గాను టైం అవుట్‌ను సూచించేందుకు కొత్త సైగ‌ను అంపైర్లు చేయ‌నున్నారు. వారు ఇక‌పై టైం అవుట్‌కు సూచిక‌గా తమ చేతి మ‌ణిక‌ట్టును పైకి లేప‌నున్నారు. దీంతో అంద‌రిలోనూ క‌న్ఫ్యూజ‌న్ పోతుంది. ఇక డీఆర్ఎస్‌కు ఎప్ప‌టిలా ‘T’ అక్ష‌రం చూపించ‌నున్నారు. ఈ మార్పును మ‌నం ఐపీఎల్ మ్యాచ్‌ల‌లో చూడ‌వ‌చ్చు. కాగా టైం అవుట్ కోరిన‌ప్పుడు అందుకు అనుగుణంగా అంపైర్లు త‌మ చేతి మ‌ణిక‌ట్టును పైకి లేపేలా వారికి ఇప్ప‌టికే ముందస్తుగా బీసీసీఐ శిక్ష‌ణ కూడా ఇచ్చింద‌ట‌. క‌నుక వారు ఇక ఐపీఎల్ మ్యాచ్‌ల‌లో టైం అవుట్ అయిన‌ప్పుడు చేతి మ‌ణిక‌ట్టును పైకి లేపి సైగ చేయ‌నున్నారు. ఇదే ఈ ఏడాది ఐపీఎల్‌లో వ‌చ్చిన పెద్ద మార్పు..! ఏది ఏమైనా.. ఈ సైగ‌ల మాట అటుంచితే ఎప్ప‌టిలాగే ఈ ఏడాది కూడా స‌మ్మ‌ర్ లో హీట్ పెంచేందుకు మ‌ళ్లీ ఐపీఎల్ వ‌చ్చేసింది. క‌నుక క్రికెట్ ప్రేమికులు ఎంచ‌క్కా మ్యాచ్‌ల‌ను వీక్షించండి మ‌రి..!

Comments

comments

Share this post

scroll to top