“పటాస్” షోకు “పెద్ద బ్రేక్”…! రవి – శ్రీముఖి లను తీసేయనున్నారు..! కారణం ఏంటో తెలుసా..?

ఒకప్పుడు అశ్లీలత అనేది ఆంగ్ల చిత్రాల్లోనే ఉండేది, మెల్లగా హిందీ సినిమాల్లో కూడా అశ్లీల సన్నివేశాలు కనిపించడం మొదలయాయ్యి. తరవాత తెలుగు సినిమాల్లో కూడా సర్వ సాధారణం అయిపొయింది. కుటుంబసమేతంగా సినిమాకి వెళ్లాలనుకునేవారు పిల్లల్ని తీసుకొని వెళ్లాలా వద్ద అని ఆలోచించుకొని సినిమాలకు వెళ్లే పరిస్థితి వచ్చేసింది. సినిమాకి ఎప్పుడో ఒకప్పుడు వెళ్తాములే అనే వదిలేస్తాము. కానీ మనం ప్రతి రోజు చూసే బుల్లి తెర కార్యక్రమాల్లో కూడా అశ్లీల మాటలు ఎక్కువైపోతున్నాయి. ముక్యంగా “జబర్దస్త్, పటాస్”. “పటాస్” షోలో “శ్రీముఖి, రవి” లు ఒకర్ని మించి ఒకరు శృతి మించుతున్నారు..

జబర్దస్, పటాస్ షో నిర్వాహకులకు హెచ్‌ఆర్సీ సోటీసులు జారీ చేసింది. ఆగస్టు 10లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. జబర్దస్, పటాస్ షోలపై గతంలో ఫిర్యాదు చేసిన సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. కామెడీ పేరుతో బూతును ప్రచారం చేస్తున్నారని దివాకర్ మండిపడ్డారు. గతంలో బాలానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోలేదని ఆరోపించారు. అయితే ఇప్పుడు హెచ్‌ఆర్సీని ఆశ్రయించానని తెలిపారు. స్పందించిన హెచ్‌ఆర్సీ ఈ రెండు కార్యక్రమాల డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు నోటీసులు జారీ చేసిందన్నారు.

పటాస్ కార్యక్రమంలో రవి, శ్రీముఖి ప్రవర్తన అసభ్యంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రికార్డింగ్ డాన్స్‌లకు కూడా అనుమతికావాలని, కానీ అంతకంటే దారుణమైన దృశ్యాలు ఏకంగా నట్టింట్లో ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత అభ్యంతరంగా ఉండే కార్యక్రమాలకు అలవాటుపడిన పిల్లల భవిష్యత్తుకు నిర్వాహకులు ఏం సమాధానం చెబుతారని దివాకర్ నిలదీశారు.

ఇంతకముందు “నర్స్” లను కించపరుస్తూ  చాలా దారుణమైన కామెంట్స్ చేశారు.! నిని వ్యతిరేకిస్తూ నర్సుల పెద్ద ఎత్తున  ఆందోళన చేస్తున్నారు. సేవామూర్తుల పైనే సెటైర్లు వేస్తే ఊరుకునేది లేద‌ని మండిప‌డ్డారు. ఇదే విష‌యం మీద ప‌టాస్ షో నిర్వాహ‌కులపై కేసు కూడా పెట్టారు. నిజమే కదండీ మనకి ఏదైనా రోగం వచ్చి హాస్పిటల్ కి వెళితే మనకు సేవ చేసేది వాళ్ళే. అలాంటి నర్స్ లపై ఇలాంటి నీచ డైలాగ్స్ ఏంటి?

Comments

comments

Share this post

scroll to top