యూట్యూబ్ లో అశ్లీల వీడియోలు…బిగ్ బాస్ విన్నర్ “శివబాలాజీ” భార్యకు వేధింపులు..! చివరికి ఏమైంది?

మహిళలపై వేధింపులు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి..సోషల్ మీడియా ద్వారా ఎన్ని లాభాలున్నాయో,అంతకంటే ఎక్కువ నష్టాలు కూడా ఉన్నాయి.ముఖ్యంగా స్త్రీలు సోషల్ మీడియా ద్వారా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.దీనికి మామూలు మధ్యతరగతి మహిళలే కాదు సెలబ్రిటీలు కూడా  ఇలాంటి వేధింపులకు గురవుతున్నారు..తాజాగా నటుడు,బిగ్ బాస్ ఫేం శివబాలాజీ భార్య మదుమితపై సోషల్ మీడియాలో వేధింపులకుసంభందించి పోలిస్ కేస్ ఫైల్ అయింది.మధుమిత కూడ  నటే..పుట్టింటికి రా చెల్లి సినిమాలో మెయిన్ రోల్ పోషించిన మధుమిత ,అడపా దడపా సినిమాలు చేసినప్పటికీ పెళ్లి తర్వాత అంతగా సినిమాలు చేయలేదు.మొన్నీ మధ్యే భలే భలే మగాడివోయ్ సినిమాలో కనిపించారు మధుమిత..బిగ్ బాస్ విన్నర్ గా శివబాలాజి ఎన్నికయినప్పుడు వార్తల్లో కనిపించిన మధుమిత .ఇప్పుడు సోషల్ మీడియాలో తనకు వేదింపులు ఎక్కువైయ్యాయంటూ కంప్లైంట్ చేసి వార్తల్లో వ్యక్తి అయ్యారు..

తమకు సంభందించిన ఒక వీడియో లింక్ పై అసభ్యకర కామెంట్స్ పెడుతున్నారని కంప్లైంట్ ఇచ్చారు శివబాలజి.తనలాగే అనేకమంది అమ్మాయిలు ,స్త్రీలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని..ఈ సమస్యను ఇక్కడితో వదిలిపెట్టనని తనపై అసభ్యకరంగా పోస్టు చేసిన వారి గురించి,నాలాగా సమస్య ఎదుర్కొంటున్న వారి గురించి పోరాడతానని మధుమిత అన్నారు..కేవలం తమకు తెలియని వారి వల్ల మాత్రమే కాదు తెలిసిన వారి నుండి కూడా సోషల్ మీడియాలో సమస్యలు ఎదుర్కొంటున్నారు..చాలా మంది భయపడి బయటకు చెప్పుకోలేరని వాపోయారు.మరొవైపు పోలిసులు ఐపి అడ్రస్ ల ఆధారంగా వారెవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు..గతంలో కూడా ఒకసారి శివబాలాజి సైబర్ క్రైం పోలిసులను ఆశ్రయించారు..కాటమరాయుడు సినిమా సమయంలో శివబాలాజి పెట్టిన పోస్టు కి అసభ్యంగా కామెంట్ పెట్టిన యువకుడు వాసుపై శివబాలాజి కేసుపెట్టారు..అప్పుడు కూడా పోలిసులు ఐపి అడ్రస్ ద్వారా ట్రేస్ అవుట్ చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Comments

comments

Share this post

scroll to top