బిగ్ బాస్ సెకండ్ సీజన్ హోస్ట్ ఎవరో తెలుసా..? ఎన్టీఆర్ ప్లేస్ లో ఆ క్రేజ్ ఉన్న హీరోనా .?

మీలో ఎవరు కోటిశ్వరుడు..బిగ్ బాస్ తదితర షోలు డైరెక్ట్ గా తెలుగులో వచ్చినవి కావు..అంతకుముందు దేశవిదేశాల్లో సక్సెస్ ఫుల్ గా  ప్రసారమైన షోలు..తెలుగు వెర్షన్లో హిట్ అవుతాయా లేదా అని ప్రోగ్రాంస్ ప్రారంభానికి ముందు ఎన్నో అనుమానాలు…బిగ్ బాస్ మొదటి సీజన్ ఎన్టీఆర్ విజయవంతంగా ముగించారు.ప్రోగ్రాంకి అత్యదిక టిఆర్పి తో పాటు ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన వచ్చింది.ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా స్టార్ మా సన్నాహాలు చేస్తుంది..కానీ సెకండ్ సీజన్ హోస్ట్ చేస్తుంది ఎన్టీఆర్ కాదు మరెవరో తెలుసా..నేచురల్ స్టార్ నానీ.

వరుస హిట్లతో ,తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ,చిన్నా,పెద్దా తేడా లేకుండా దూసుకుపోతున్నాడు నానీ.ఇప్పుడు నానీనే బిగ్ బాస్ సెకండ్ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. విశేషమైన కామెడీ టైమింగ్, జనాల్లో మంచి ఫాలోయింగ్, సోషల్ మీడియాలో పాపులారిటీ కలిగి ఉన్న నాని అయితేనే సెకండ్ సీజన్ కు న్యాయం జరుగుతుందని సదరు షో నిర్వాహకులు తలంచి.. నానీని ఫిక్స్ చేశారని తెలుస్తోంది.ఇంతకుముందు ఐఫా అవార్డ్ ఫంక్షన్లో కూడా రానా తో పాటు నానీ హోస్ట్ గా వ్యవహరించి విశేషంగా ఆకట్టుకున్నాడు.

మీలో  ఎవరు కోటిశ్వరుడు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.రెండవ సీజన్ కి మెగాస్టార్ హోస్టింగ్ పట్ల కొంత అసంతృప్తి వెల్లడయింది..బిగ్ బాస్  ప్రోగ్రామ్ థీమ్ తోపాటు ఎన్టీయార్ హోస్టింగ్ విపరీతంగా ప్లస్ అయ్యి సూపర్ హిట్ అయింది.ఇప్పుడు నానీ హోస్టింగ్ ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి..

Comments

comments

Share this post

scroll to top