బిగ్ బాస్ తెలుగు సీసన్ 3 హోస్ట్ ఎవరో తెలుసా..?

బిగ్ బాస్ తెలుగు సీసన్ 1 కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఆయన చాలా అద్భుతంగా షో ని హ్యాండిల్ చేసారు, ఎన్టీఆర్ లో కొత్త యాంగిల్ ని ఆ షో ద్వారా చూసాం, బిగ్ బాస్ తెలుగు మొదటి సీసన్ ఏ భారీగా హిట్ అవ్వడం తో రెండో సీసన్ పైన అంచనాలు పెరిగాయి, మొదటి సీసన్ లో శివ బాలాజీ విజేతగా నిలిచాడు.

ఈ సారి హోస్ట్ కాదు కంటెస్టెంట్…

అయితే బిగ్ బాస్ తెలుగు సీసన్ 2 కి డేట్స్ కుదరకపోడంతో ఎన్టీఆర్ తప్పుకున్నారు హోస్ట్ గా, ఎన్టీఆర్ స్థానం లో న్యాచురల్ స్టార్ నాని వచ్చారు. నాని కూడా హోస్ట్ గా షో ని బాగా హ్యాండిల్ చేసారు, కానీ నాని నే డామినేట్ చేసాడు బిగ్ బాస్ తెలుగు సీసన్ 2 లో ఒక కంటెస్టెంట్. అతడే కౌశల్, ఒక షో ద్వారా ఒక మనిషి ఇంత క్రేజ్ ని సంపాదించుకోగలడా అని అందరూ ఆశ్చర్య పోయే రేంజ్ లో కౌశల్ క్రేజ్ సంపాదించుకున్నాడు, బిగ్ బాస్ తెలుగు సీసన్ 2 చాలా పెద్ద హిట్ అయ్యింది, అందుకు ముఖ్య కారణం కౌశల్ ఏ.

సీసన్ 3 పైన అంచనాలు బాగా పెరిగాయి.. :

అయితే రెండు సీసన్ లు మంచి జనాధారణ పొందటంతో సీసన్ 3 పైన అంచనాలు భారీగా ఉన్నాయ్ జనాల్లో, అందుకు తగ్గట్టు గానే పేరున్న సెలబ్రిటీస్ ని సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారు, కానీ హోస్ట్ విషయానికి వచ్చే సరికి ఇంకా ఎవరు అనేది కంఫర్మ్ చెయ్యలేదు.

చిరంజీవి … వెంకటేష్ :

మెగా స్టార్ చిరంజీవి గారు కానీ, విక్టరీ వెంకటేష్ గారు కానీ బిగ్ బాస్ తెలుగు సీసన్ 3 కి హోస్ట్ గా వ్యవహరిస్తారు అని సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతున్న వార్త. మెగా స్టార్ చిరంజీవి ఇది వరకు మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి హోస్ట్ గా వ్యవహరించారు, విక్టరీ వెంకటేష్ ఇది వరకు ఏ షో కి కూడా హోస్ట్ గా వ్యవహరించలేదు. ఈ ఇద్దరిలో ఏ ఒకరు హోస్ట్ గా వ్యవహరించినా, సీసన్ 3 కి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. కొన్ని రోజుల్లో ఈ విషయం మీద స్పష్టత ఇవ్వనున్నారు స్టార్ మా వాళ్ళు.

 

Comments

comments

Share this post

scroll to top