“బిగ్ బాస్ విన్నర్” ఎవరో పక్కన పెట్టండి.! “హరితేజ” కు ఎన్టీఆర్ ఏం గిఫ్ట్ ఇవ్వనున్నారో తెలుసా.? ఎందుకిస్తున్నారు?

బిగ్ బాస్ ప్రోగ్రాం  కంటెస్టంట్స్ అందరిని ఒక్కసారిగా సెలబ్రిటీస్ ని చేసేసింది..వారిలో ఉన్న లోపాలను,టాలెంట్స్ ని బయటపెట్టడానికి వేదికైంది.మొదట్లో ప్రొగ్రాంపై కొంత అసహనం వ్యక్తం అయినప్పటికి ముగింపు దశకు చేరుకునేసరికి ప్రేక్షకులను వివిధరకాల టాస్క్ లతో అలరిస్తుంది.ఈ ప్రోగ్రాం ద్వారా ఎక్కువ బెనిఫిట్ పొందింది ఎవరన్నా ఉన్నారా అంటే అది హరితేజానే..మొదటి ఎపిసోడ్ నుండి కూడా హౌజ్మేట్స్ తో సక్యతగా ఉంటూ తనలోని టాలెంట్ ని బయటపెడుతూనే ఉంది..గెలుపోటములకు సంభందంలేకుండా ఆల్రేడి ప్రేక్షకుల మనసే కాదు..ఏకంగా ఎన్టీఆర్ మనసే గెలుచుకుంది.

బిగ్ బాస్ లో అడుగుపెట్టకముందు హరితేజ యాంకర్..రెండు మూడు సినిమాల్లో నటించిన చిన్న నటి..ఇవే ప్రేక్షకులకు తెలిసినవి..తెలియనివి చాలానే ఉన్నాయి..హరితేజ యాంకరే కాదు,యాక్టర్ ,డ్యాన్సర్,సింగర్ మల్టీటాలెంటెడ్..ఆ టాలెంట్స్ అన్ని బిగ్ బాస్ షో ద్వారా బయటపెట్టింది హరితేజ..షో లో హరితేజ చెప్పిన బుర్రకథ కి ప్రేక్షకులందరూ కనెక్ట్ అయ్యారు..దానికే కాదు హరితేజ అల్లరికి,డ్యాన్స్ కి,మాటలకు,మెచ్యురిటీకి అన్నింటికి ఫిదా అయ్యారు .ప్రేక్షకులతో పాటు గా ఎన్టీఆర్ కూడా ..అందుకే షో ముగిసిన తర్వాత ఫలితమతో సంబంధం లేకుండా తన ప్రతి సినిమాలో హరితేజకి ఓ రోల్ తప్పకుండా ఇవ్వడానికి తారక్ రెడీగా ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు తనకి తెలిసిన దర్శకుల సినిమాల్లోనూ హరితేజకి సరిపోయే రోల్ ఉంటే ఇవ్వమని స్వయంగా అడగనున్నట్లు తెలిసింది.  సో హరితేజ లైఫ్ మారిపోనున్నదన్నమాట…

Comments

comments

Share this post

scroll to top