CONFIRMED: “బిగ్ బాస్” ఫైనల్ కి వచ్చే ఇద్దరు గెస్ట్స్ ఎవరో తెలుసా.? విన్నర్ కి ఇచ్చే “కాష్ ప్రైజ్” ఎంతంటే..!

70రోజులు.. 60 కెమెరాల మధ్య.. 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమయింది బిగ్ బాస్ షో. ఈ షోకు స్టార్ హీరో తారక్ హోస్టింగ్ చేయనుండడం.. తెలుగులో ఈ తరహా షో రావడం ఇదే తొలిసారి కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు.. మరెన్నో అనుమానాలు.. ఏదైతేనేం అంచనాలను అందకుంటూ.. అనుమానాలను పటాపంచలు చేస్తూ విజయం సాధించింది తెలుగు ‘బిగ్ బాస్’. చూస్తుండగానే షో ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. ఇప్పుడు మిగిలింది ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే. రెండు రోజులయితే విజేత ఎవరో తెలిసిపోతుంది.

ప్రతివారం శని, ఆది రెండు రోజులూ ‘బిగ్‌బాస్’ షోలో కనిపించే ఎన్టీఆర్.. ఈ వారం ఆదివారం ఒక్కరోజే కనిపించనున్నారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టంట్స్ కూడా ఫినాలే కోసం హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. కాబట్టి శనివారం ఎపిసోడ్ అంతా వాళ్ల ముచ్చట్లే ఉండబోతున్నాయి. ఇక ఆదివారం రాత్రి.. తారక్ వన్‌మ్యాన్ షోగా.. దాదాపు 4 గంటల పాటు బిగ్‌బాస్ షో ఆకట్టుకోనుందని సమాచారం.  ‘స్టార్’ యాజమాన్యం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ను ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచే మొదలు పెట్టబోతున్నట్లు ప్రకటించింది.

అంటే కాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగార్జున, దేవీశ్రీప్రసాద్ లు హాజరుకానున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఆట పాటలతో అలరించనుండగా, ఈ సీజన్ విన్నర్ కి నాగార్జున బహుమతిని ప్రదానం చేయనున్నారు. అలాగే ఇతర పార్టిసిపెంట్స్ కామెడీ స్కిట్స్ తో నవ్విస్తారని సమాచారం. మొత్తానికి రేపు బుల్లితెర ప్రేక్షకులకు నాలుగు గంటలపాటు నాన్ స్టాప్ వినోదాన్ని పొందనున్నారు.

విన్నర్ కి అక్షరాలా 50 లక్షల కాష్ తో పాటు అదనపు బహుమతులు కూడా ఉంటాయని చెప్పి క్లారిటీ ఇచ్చేసారు యంగ్ టైగర్. మరి విన్ అయ్యేది చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top