బిగ్ బాస్ హరితేజను అప్పట్లో సడన్ గా “అభిరుచి” నుండి తీసేశారు..అప్పుడు హరితేజ ఏం చేసిందో తెలుసా..?

బిగ్ బాస్ లో హరితేజ ముందు నుండి చురుగ్గా ఉంటుంది.ఎందుకుండదు తను వచ్చిన ఫీల్డ్ అలాంటిది హరితేజ మంచి యాంకర్.ఈటీవి లో వచ్చే అభిరుచి ప్రోగ్రాంతో పాటు ఈటివి ప్లస్ లో నా షో నా ఇష్టం లో చంటితో పాటు గా యాంకరింగ్ చేసింది.యాంకర్ అంటేనే హుషారుగా ఉండి ప్రేక్షకులను హుషారెత్తించాల్సిన ఫీల్డ్.అడపాదడపా సీరియల్స్ చేస్తూ మధ్య మధ్యలో సినిమాల్లోనూ  చిన్న పాత్రలు పోషించింది.ఎన్టీఆర్ దమ్ము,త్రివిక్రమ్ అఆ మూవీలో నటించింది.బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ఉంటూ ,ఫైనల్ విన్నర్ అవుతుందేమో అనేలా అంచనాలు పెంచుతుంది హరితేజ..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో హరితేజకు సత్సంభందాలున్నాయి.దానికి కారణాలు హరితేజ మల్టీటాలెంటెడ్..హరితేజ లో ఒక సింగర్ ,యాక్టర్,డ్యాన్సర్ మంచి యాంకర్ కూడా ఉన్నారు..ఇన్ని లక్షణాలున్న హరితేజను త్రివిక్రం సూర్యాకాంతం అని ఆటపట్టిస్తుంటారు..ఎలాంటి క్యారెక్టర్ అయినా అలవోకగా చేసేయగలదు అనే త్రివిక్రం హరితేజను అలా పిలుస్తారు..అభిరుచి ప్రోగ్రాంకు చాలా కాలం పాటు హరితేజ యాంకర్ గా కొనసాగింది.ఆ తర్వాత హరితేజను ఆ ప్రోగ్రాం నుండి తీసేసినప్పడు చాలా బాదతో త్రివిక్రమ్ కి కాల్ చేస్తే..“నువ్వు ఆ ప్రోగ్రామ్ కు ఎమోషనల్ కనెక్ట్ అవ్వలేదు తొక్కా లేదు, నీకు ఆ ప్రోగ్రామ్ అంటే ఎందుకిష్టమో చెప్పనా.. పక్కన రాజుగారు(కుక్) వంట చేస్తుంటే వాటిని చూస్తు ఉండడం, తినడం ఇష్టం అందుకే బాధ పడుతున్నావ్ అంతే!!” అని త్రివిక్రమ్ గారు బదులిచ్చారట. దానికి హరితేజ కు నవ్వు ఆపుకోలేక పోయిందట అలా నవ్వించి తనని ఓదార్చారు…

ఆ తర్వాత త్రివిక్రమ్,నితిన్ కాంబినేషన్లో వచ్చిన అఆ మూవిలో హరితేజకు మంచి రోల్ ఇచ్చారు మన డైరెక్టర్.ఆ షూటింగ్ జరిగిన ఆర్నెళ్లపాటు కూడా త్రివిక్రమ్ గారి నుండి చాలా విషయాలు నేర్చుకున్నానని,ముఖ్యంగా పుస్తకాలు చదివే అలవాటు .. “ఒక ధృడమైన జన్మ ఎన్నో జన్మలను కదిలించగలదు”. త్రివిక్రమ్ గారి వల్ల హరితేజ తన జీవితానికి అవసరమయ్యే గొప్ప పుస్తకాలు చదవడం మొదలుపెట్టిందట.. నిజమే సినిమాలకు త్రివిక్రమ్ గారు రాసే  మాటలు ప్రేక్షకులకు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి..అలాంటిది అతను డైరెక్ట్ గా మనుషులను ప్రభావితం చేస్తారనడానికి హరితేజ ఉదాహరణ.

Comments

comments

Share this post

scroll to top