ఆ మహిళ కారులో బిడ్డకు పాలిస్తుంది…ఇంతలో పోలీసులు వచ్చి ఏం చేసారో తెలుస్తే కోపం రావడం పక్కా..!

పోలీస్ యూనిఫామ్ లో ఉన్నపర్సన్ ని చూస్తేనే భయపడే పరిస్థితి.అది వారి నిజాయితి చూసి కాదు..వారిలోని కఠిన ప్రవర్తన,తప్పు లేకపోయినా ఎక్కడ నేరం మోపుతారో అనే భయం,లేదంటే చలాన్లు రాస్తారు,లంచాలు తీసుకుంటారు ఇది పోలిసుల గురించి సాధారణ జనం అభిప్రాయం… ఒక వైపు ఫ్రెండ్లీ పోలిసింగ్ అంటూ..మాలో కూడా మానవత్వం ఉన్న మనుషులన్నారంటూ కొందరు పోలీసులు నిరూపిస్తుంటే. మరోవైపు ఖాకీ చొక్కా,కరుకుతనం రెండు పర్యాయపదాలని మరోసారి రుజువు చేస్తున్నారు కొందరు..బిడ్డకు పాలిస్తున్నా అని చెప్పినా వినిపించుకోకుండా తమలోని కాఠిన్యాన్ని బయటపెట్టారు కొందరు పోలీసులు..

కారులో వెళ్తున్న జ్యోతి మలే అనే మహిళ తన బిడ్డ ఆకలికి ఏడుస్తుండడంతో కారును రోడ్డుపై ఒక పక్కగా  ఆపి,తన బిడ్డకు  పాలు ఇస్తోంది.దీంతో ఒక సారిగా పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్డుపై ‘నో పార్కింగ్’ ప్రదేశంలో ఆగి ఉందని తమ పని యధావిదిగా చేపట్టారు.  కారులో మహిళ ఉందని, ఆమె తన బిడ్డకు పాలిస్తోందని తెలిసినా ఏ మాత్రం కనికరం చూపలేదు.మానవత్వాన్ని మర్చిపోయి… మహిళ, చిన్నారి కారులో ఉండగానే రికవరీ వ్యాన్‌కు ఆ కారును తగిలించి తీసుకుపోయిన ఈ ఘటన ముంబాయిలో జరిగింది. తాను కారులో ఉన్నానని, బిడ్డకు పాలిస్తున్నానని మహిళ అరిచి గీపెట్టినా పోలీసులు పట్టించుకోలేదు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది..

watch video here:

తనకు ఆరోగ్యం సరిగా లేదని,బిడ్డకు పాలిస్తున్నా అని చెప్పినా వినకుండా,కనీసం కిందికి దిగమని కూడా చెప్పకుండా తమతో పాటు రికవరీ వ్యాన్ కి కార్ ని అటాచ్ చేసి తీసుకుపోయారని వాపోయింది..ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోతో అక్కడి కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసారు.

Comments

comments

Share this post

scroll to top