భువనేశ్వర్ కుమార్.. టీమిండియా క్రికెట్ జట్టులో ఫాస్ట్ బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రత్యర్థి జట్టు సభ్యులకు తన పేస్ బౌలింగ్‌తో ముచ్చెమటలు పట్టించగలడు. ఈ మధ్యే కోల్‌కతాలో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కీలక వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. అయితే భువీ ప్రస్తుతం టీమిండియా ఆడుతున్న టెస్ట్ మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. ఎందుకంటే అతనికి వివాహం అయింది కనుక. అవును, కరెక్టే. భువనేశ్వర్ కుమార్ ఓ ఇంటి వాడయ్యాడు.
తాను చిన్నప్పటి నుంచి కలసి మెలసి తిరిగిన తన చిన్ననాటి స్నేహితురాలు నుపుర్ నగర్‌ను భువీ వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి మీరట్‌లో జరిగింది. ఇరు వర్గాలకు చెందిన కుటుంబ సభ్యులు, కొద్ది మంది స్నేహితుల సమక్షంలో భువనేశ్వర్ కుమార్ వివాహం జరిగింది. అయితే భువీ పెళ్లి సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో చమత్కారంతో కూడిన జోక్ వేస్తూనే మరో వైపు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపాడు.
Ek din mai do shikaar 😃 fast bowlers are having good day off the field. Congrats @BhuviOfficial and Nupur. God bless! pic.twitter.com/rHt2ywHMml
— Rohit Sharma (@ImRo45) November 23, 2017
భువనేశ్వర్ కుమార్, నుపుర్ నగర్ల రిసెప్షన్ మాత్రం రెండు సార్లు జరగనుంది. ఈ నెల 26వ తేదీన బులంద్ షహర్ లో ఒకసారి తమ రిసెప్షన్‌ను భువీ ఏర్పాటు చేయగా, మరోసారి ఈ నెల 30వ తేదీన ఢిల్లీలో మరోసారి రిసెప్షన్ ఏర్పాటు చేశాడు భువీ. అయితే ఢిల్లీలో పెట్టిన రిసెప్షన్ ప్రత్యేకంగా క్రికెటర్లకే కావడం విశేషం..! కాగా ప్రస్తుతం భువీ పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి..!