“ఎమ్మెల్యే బాబూమోహన్” ఎమ్మార్వోని ఫోన్ లో ఎలా బూతులు తిట్టారో తెలుసా.? పక్కనున్నవారు వీడియో తీసి పేస్ బుక్ లో పెట్టేసరికి!

సినీ నటుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్ మరోసారి నోరు పారేసుకున్నారు.ఈ సారి ఎమ్మార్వోని బూతులు తిట్టారు. తహసీల్దార్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాబూమోహన్ తిట్ల పురాణం మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది.ఈయన  మొన్నీమధ్య కూడా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఓ గ్రామంలోని ప్రజలతో మాట్లాడుతూ బూతుల చిట్టా విప్పడం తెలిసిందే. పక్కన మహిళలు ఉన్నారని కూడా చూడకుండా ఆయన పచ్చి బూతులు వాగారు.ఇప్పుడేమో ఇలా ఒక ఎమ్మార్వోని నానా మాటలన్నారు…

పాలిటెక్నిక్‌ కళాశాలకు దారి లేదని రెండేళ్లుగా చెబుతున్నాను. ఎల్లుండి హోం మంత్రి, అవతలి ఎల్లుండి డిప్యూటీ సీఎం వస్తుంటే…. ఒక వీఆర్వోను పంపి రోడ్డు చూసి రమ్మంటావా? ఏమనుకుంటున్నావయ్యా? నువ్వెంత.. నీ ఉద్యోగమెంత? డిప్యూటీ సీఎంకు ఏం చెప్పాలి? నిన్ను సస్పెండ్‌ చేయమని చెప్పనా?’ అంటూ పుల్‌కల్‌ తహసీల్దార్‌ సమ్మయ్యపై  బాబూమోహన్‌ బూతుపురాణం విప్పారు. ఫోన్‌లో ఎటాపెడా వాయిస్తుండగా ఎవరో దాన్ని రికార్డు చేశారు. తన నియోజకవర్గంలో  శివపేట వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి దారి లేదు.‘మీరు ఊరకనే ఉద్యోగాలు చేస్తున్నారా. నువ్వు ముందుపొయ్యి అక్కడ ఉండాలి కదా? ఇంజనీర్‌కు చెప్పి పని చేయించాలి కదా? ఏం పీకుతున్నావ్ నువ్వు? అక్కడే పాలిటెక్నిక్‌ దగ్గర రోడ్డు మీద ఉండు. నేను వస్తున్నా….’ అంటూ బాబూమోహన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

watch video here:

Comments

comments

Share this post

scroll to top