ఉన్నత ఉద్యోగం వదిలిపెట్టి…దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సరికొత్త మార్గాన్ని చూపుతున్న క్రాంతి.

వాడేంట్రా బాబు…. అంత చదువు చదివి మళ్లీ వ్యవసాయం, గివసాయం అంటూ పోలాల వెంట తిరుగుతున్నాడు, బాగుపడే లక్షణాలు ఒక్కటి కూడా కనిపించట్లే వాడిలో…..ఇవి ఆ యువకుడిని చూసి అతని స్నేహితులు, బంధువులు చాటుగా అనుకునే మాటలు. అవును..! వాళ్ళన్న మాటల్లో కూడా అర్థం ఉంది కదా! గిట్టుబాటు ధరల కోసం, కురుస్తాయో లేవో నమ్మకం లేని వానలకోసం..ఎదురుచూసి చూసి..ఎందరో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే…పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి…దొరికిన మంచి ఉద్యోగాన్ని కాదని…పొలాలు-పుట్టల వెంట…కొత్త పద్దతిలో వ్యవసాయం అంటూ తిరిగితే ఇలాంటి మాటలే కదా వచ్చేయ్.! ఆ యువకుడు ఇలాంటి మాటలను లెక్క చేయలేదు…దేశానికి అన్నం పెట్టే రైతన్నల కోసం ఏదైనా చేయాలని గట్టిగా తీర్మానించుకొనే తన ఉద్యోగానికి సైతం రాజీనామ చేసి వ్యవసాయం మీద దృష్టి సారించాడు.అతని పేరే క్రాంతి కుమార్, నల్గొండ జిల్లా హుజుర్ నగర్ కు చెందిన వాడు.

KRANTHI

పర్యావరణానికీ, నేలకు,మనుషులకు హాని కలగకుండా పంటలు పండిచాలి ఇదే అతని కాన్సెప్ట్ దీని కోసం మన సాంప్రదాయ పద్దతికి కాస్తంత కొత్త టెక్నాలజీ జోడించి సేంద్రీయ పద్దతిలో అద్వితీయ దిగుబడి రాబట్టే పంటలను ఎలా పండించొచ్చో ఊరూరా తిరుగుతూ రైతులకు సేంద్రీయ వ్యవసాయ పాఠాలు బోధించాడు. ఎటువంటి క్రిమీ సంహాకర మందులను ఉపయోగించకుండా పంటలు పండిస్తున్న రైతుల దగ్గరికి వెళ్లి వారిని ప్రోత్సాహించడం….వారి విజయాలను ఇతర రైతుల వద్ద ప్రస్తావిస్తూ వారిని కూడా సేంద్రీయ పద్దతిలో వ్యవసాయం చేసేలా మోటీవేట్ చేసేవాడు క్రాంతి కుమార్.

KRANTHI2

సేంద్రీయ పద్దతిలో వ్యవసాయాన్ని ఇంకా ఇంకా ప్రోత్సాహించాలి..దీని కోసం ఓ బలమైన మాద్యమాన్ని ఎన్నుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన కాన్సెప్ట్ ను పట్టుకొని టీవీ సంస్థలను ఆశ్రయించాడు. రైతులకు మేలు జరిగే కార్యక్రమం కాబట్టి టీవీ వాళ్లు ఓకే అన్నారు. అలా మా టివీ లో స్టార్ట్ అయిన ఆయన ప్రోగ్రామ్ 150 పై చిలుకు ఎపిసోడ్ లతో దిగ్విజయంగా నడిచింది. అందుకు గానే ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమం ద్వారా………. సరికొత్త విధానాల్లో వ్యవసాయం చేసే ఎందరో రైతుల్ని, వారి అనుభవాల్ని వారం వారం పరిచయం చేశాడు. టీవీలో ప్రత్యక్షంగా, యూట్యూబ్‌లో పరోక్షంగా లక్షల మంది ప్రేక్షకులు ఈ కార్యక్రమం ద్వారా స్ఫూర్తి పొందుతున్నారు.

కొసమెరుపు: క్రాంతి మొదట రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్నాళ్లు పనిచేశారు, కానీ తన అసలు లక్ష్యం రైతుల అభ్యున్నతి అని డైరెక్షన్ ఫీల్గ్ ను వదిలిపెట్టి…. అందరికీ అన్నం పెట్టే ఫీల్డ్ పదికాలాల పాట బాగుండాలని ఇలా ఆలోచించి అడుగేశాడు.

Comments

comments

Share this post

scroll to top