అప్పుతీర్చడం ఆలస్యం అయితే,మహిళల శీలంతో ఆటలు..కాల్ మనీ కేసులో కొత్తకోణం.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాల్ మనీ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మానసిక, శారీరక వేధింపులే కాకుండా ఏకంగా మహిళల శీలాల్ని కూడా దోచుకున్నట్టు వార్తలొస్తున్నాయి. దీని వెనుక రాజకీయ నాయకుల హస్తం కూడా ఉన్నట్టు  కూడా భోగట్టా..! అందులో భాగంగానే భవానీ శంకర్ అనే బాక్సర్ భాగోతం బయటపడింది. అప్పు తీర్చలేని మహిళలను శారీరకంగా  అనుభవించడం , ఆ తర్వాత వారిని వ్యభిచార నిర్వాహకులకు అమ్మడం తద్వార వచ్చే డబ్బులను వడ్డీ కింద కట్టమని చాలా మందిని వేధింపులకు గురి చేశాడట భవానీ శంకర్.  కూల్ డ్రింక్ లో మత్తు మందుకలిపి ఇచ్చి వారిని అనుభవించినట్టు వార్తలు కూడా వస్తున్నాయ్.

Watch Video:

ముఖ్యంగా విజయవాడ లో చాలా మంది…ఈ కాల్ మనీ కింద ఇరుక్కుని ఉన్నట్టు తెలుస్తుంది. చిన్న చిన్న వ్యాపారస్థులు, ఆటోడ్రైవర్లు, టిఫిన్ సెంటర్లు నడిపే వారంతా… వడ్డీకి డబ్బులు ఇచ్చే వారి దగ్గర నుండి 5 నుండి 35 రూపాయల వడ్డీ వరకు అవసరాన్ని బట్టి తీసుకుంటారు. తిరిగి చెల్లించలేని పక్షంలో….. ఇలాంటి వికృత చర్యలకు పాల్పడతారట! ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఈ కేసు పై  దృష్టి సారించింది పోలీసు యంత్రాంగం. త్వరలోనే దీంతో సంబంధం ఉన్న అందర్నీ పట్టుకుంటామని తెలిపారు పోలీసు పెద్దలు.

Comments

comments

Share this post

scroll to top