భార్యను హింసిస్తూ…వేరొకరితో క్రికెటర్ “షమీ” అక్రమ సంబంధం.! వాట్సాప్ చాట్ లీక్ చేసిన అతని భార్య.!

సెలబ్రిటీలు, క్రీడాకారులు, రాజ‌కీయ నాయ‌కులు లేదా ఇత‌ర ప్ర‌ముఖులు ఎవ‌రైనా కావ‌చ్చు. ఎంత పెద్ద హోదాలో అయినా ఉండ‌వ‌చ్చు. ఎంత పేరు అయినా సంపాదించి ఉండ‌వ‌చ్చు. కానీ అలా హోదా ఉన్న‌ప్ప‌టికీ వారిలో కొంద‌రు చేస్తున్న ప‌నులు మాత్రం నీచంగా ఉంటున్నాయి. ముఖ్యంగా అలాంటి కొంద‌రు సెల‌బ్రిటీలు మ‌హిళ‌లను వేధించ‌డంలోనూ ముందే ఉంటున్నారు. తాము ఉన్న స్థానం మ‌రిచిపోయి సాధార‌ణ మృగాళ్ల‌లా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ప్ర‌ముఖ క్రికెట‌ర్ మ‌హమ్మ‌ద్ ష‌మీ కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతాడు. తాజాగా అత‌ని వేధింపుల విష‌యం పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

క్రికెట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీకి హ‌సిన్ జ‌హ‌న్ అనే యువ‌తితో 2014లో వివాహం అయింది. వీరికి ఒక కుమార్తె కూడా జ‌న్మించింది. అయితే పేరుకు పెద్ద క్రికెట‌ర్ అయినా కూడా మ‌హమ్మ‌ద్ షమీ సాధార‌ణ మ‌నిషిలా, మృగాడిలా బిహేవ్ చేసేవాడ‌ట‌. ఈ విష‌యాన్ని తాజాగా అత‌ని భార్య హసిన్ వెల్ల‌డించింది. అత‌నికి ప‌లువురు మ‌హిళ‌ల‌తో అక్ర‌మ సంబంధాలు ఉన్న‌ట్లు తెలిపింది. వాటికి సంబంధించిన ప‌లు సాక్ష్యాల‌ను కూడా ఫొటోల రూపంలో ఆమె విడుద‌ల చేసింది. స‌ద‌రు మ‌హిళ‌ల‌తో ష‌మీ వాట్సాప్‌, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌ల‌లో అస‌భ్యక‌రంగా మాట్లాడాడు చూడండి.. అంటూ స‌ద‌రు సంభాష‌ణ‌ల తాలూకు స్క్రీన్ షాట్ల‌ను హ‌సిన్ త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.

అయితే హ‌సిన్ పోస్టు చేసిన ఆ స్క్రీన్ షాట్లు కొంద‌రు ఫేక్ అంటున్నారు. ఆమె అకౌంట్ హ్యాక్ అయింద‌ని అంటున్నారు. ఇక ష‌మీ వ్య‌వ‌హారంపై హ‌సిన్ స్పందిస్తూ ష‌మీ త‌న‌ను రోజూ చిత్ర హింస‌ల‌కు గురి చేసేవాడ‌ని, అత‌ని త‌ల్లి, సోద‌రుడు కూడా హింస పెట్టేవార‌ని, అది రోజూ అర్ధ‌రాత్రి 2, 3 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగేద‌ని ఆమె తెలిపింది. అయిన‌ప్ప‌టికీ అన్నింటినీ తాను భ‌రిస్తూ వచ్చాన‌ని, త‌న కూతురి కోసం ఆలోచించాన‌ని, అయితే ఇప్పుడు ష‌మీకి ఇత‌ర మ‌హిళ‌ల‌తో ఉన్న సంబంధం తెలిశాక ఇక ఎంత మాత్రం భ‌రించ‌లేక‌పోయాన‌ని, ఇక అత‌నితో క‌ల‌సి ఉండేది లేద‌ని, దీనిపై పోలీసుల‌కు కంప్లెయింట్ ఇస్తాన‌ని ఆమె తెలిపింది.

కాగా మ‌రో వైపు ష‌మీ స్పందిస్తూ.. త‌న‌పై ఎవ‌రో కావాల‌ని వీటిని క్రియేట్ చేశార‌ని, త‌న‌కు అలా అక్ర‌మ సంబంధాలు పెట్టుకునే అవ‌స‌రం లేద‌ని, అవ‌న్నీ పుకార్లేన‌ని కొట్టి పారేశాడు. అయితే ఈ విష‌యంలో నిజం ఉందో, లేదో తెలియ‌దు కానీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ష‌మీని జ‌నాలు ఒక ఆట ఆడుకుంటున్నారు. అత‌న్ని విమ‌ర్శ‌ల‌తో ట్రోల్ చేస్తున్నారు. గ‌ట్టిగా బుద్ధి చెప్పాలి అత‌నికి అని కోరుతున్నారు. ఏది ఏమైనా ఈ వివాదం మాత్రం ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌ణిగేలా లేదు. చివ‌ర‌కు ఏమ‌వుతుందో చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top