డ్ర‌గ్స్ కోసం స్నేహితుల‌తో భార్య‌ను రేప్ చేయించాడు ఆ వ్య‌క్తి..! నీచ‌మైన ఘ‌ట‌న‌..!

మ‌గాళ్లు కాదు వారు. మృగాళ్లు. అవును, మేం చెబుతోంది నిజ‌మే. విష‌యం తెలుసుకుంటే మీరు కూడా అదే అంటారు. నిజానికి వారికి మృగాళ్లు అనే ప‌దం కూడా త‌క్కువే అవుతుంది. వారిని రాక్ష‌సులు అంటేనే క‌రెక్ట్‌. ఎందుకంటే సంఘ‌ట‌న అలాంటిది మ‌రి. డ్ర‌గ్స్‌కు బానిసైన అత‌ను డ్ర‌గ్స్ కొన‌డం కోసం ఏకంగా త‌న భార్య‌నే ప‌ణంగా పెట్టాడు. స్నేహితుల‌ను ఆమె వ‌ద్ద‌కు పంప‌గా వారు ఆమెను రేప్ చేశారు. దీంతో బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

అది పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో ఉన్న డాఖా అనే ప్రాంతం. అక్క‌డ ఓ వ్య‌క్తికి ఓ యువ‌తితో కొన్నేళ్ల క్రితం పెళ్ల‌యింది. వారికి ఓ కొడుకు కూడా పుట్టాడు. అయితే క్ర‌మంగా ఆ వ్య‌క్తి ప‌నిచేయ‌డం మానేసి బ‌ల‌దూర్ తిరిగే వాడు. ఈ క్ర‌మంలోనే డ్ర‌గ్స్ బాగా అల‌వాటైంది. డ్ర‌గ్స్‌కు అత‌ను బానిస అయ్యాడు. డ‌బ్బులు ఇంట్లో ఉంటే తీసుకెళ్ల‌డం, డ్ర‌గ్స్ కొన‌డం, ఎక్కించుకోవ‌డం ఇదే ప‌ని అయిపోయింది. ఈ క్రమంలో అతను డ్రగ్స్ కోసం కొంద‌రు స్నేహితుల వ‌ద్ద అప్పు కూడా చేశాడు.

అయితే సంపాద‌న లేదు క‌నుక ఆ వ్యక్తికి డ్ర‌గ్స్ కొనేందుకు మళ్లీ డ‌బ్బు ల‌భించ‌డం క‌ష్ట‌మైంది. దీంతో అత‌ను చాలా నీచ‌మైన ప‌నికి ఒడిగ‌ట్టాడు. భార్యను డ్ర‌గ్స్ కోసం ఉప‌యోగించుకోవాల‌ని అనుకున్నాడు. అందులో భాగంగానే త‌న‌కు ఉన్న 7 మంది స్నేహితుల వ‌ద్ద డ‌బ్బులు తీసుకుని వారిని భార్య దగ్గ‌ర‌కు పంపాడు. దీంతో ఆ 7 మంది క‌లిసి ఆమెపై అత్యాచారం చేశారు. ఈ క్ర‌మంలో బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, వారు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేపట్టారు. ఆమె భ‌ర్త‌పై ఐపీసీ 120బి సెక్ష‌న్ ప్ర‌కారం కేసు న‌మోదు చేయ‌గా, ఆ 7 మందిపై 376(రేప్‌) సెక్ష‌న్ కింద కేసు పెట్టారు. ఇక నిందితులేమో ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసుల‌కు దొర‌క‌లేదు. మ‌రి వారు ఎప్పుడు దొరుకుతారో, బాధితురాలికి ఎప్పుడు న్యాయం జ‌రుగుతుందో. ఏది ఏమైనా ఇలాంటి నేరాల‌కు పాల్ప‌డేవారిని మాత్రం అస్స‌లు విడిచిపెట్ట‌కూడ‌దు..!

Comments

comments

Share this post

scroll to top