హైదరాబాద్ లో మరో శాడిస్ట్ భర్త…భార్యకు పిచ్చిపట్టిందని ఎలా నమ్మించాడో తెలుసా.? మంత్రగాడి చేత వాతలు.!

ఒకవైపు భర్తలను చంపుతున్న భార్యలు ..మరోవైపు భార్యలను చిత్రహింసలు పెడుతున్న శాడిస్టు భర్తలు ఈ మధ్య ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి..తాజాగా తన అక్రమసంబంధాన్ని బయట పెట్టి నలుగురి మధ్య పంచాయితి పెట్టించిందనే కోపంతో భార్యను చిత్రహింసలకు గురిచేశాడో శాడిస్టు భర్త.అంతేకాదు దెయ్యం పట్టిందనే నెపంతో మంత్రగాడి చేత వాతలు పెట్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది…

 శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేట గ్రామానికి చెందిన కంచుగంట్ల నాగేశ్‌ కు,మంగకు పెళ్లి జరిగి పదేళ్లవుతుంది..వీరికి ఇద్దరుపిల్లలు కూడా ఉన్నారు..అయితే గత ఐదేండ్లనుండి నాగేశ్ ,శ్రీలత అనే మహిళతో వివాహేతర సంభందం పెట్టుకున్నాడు.అప్పటినుండి మంగను శారీరకంగా మానసికంగా హింసించేవాడు..వేధింపులు భరించలేక భర్త ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని ,శ్రీలత తో అతడి సంభందం విషయం తెలుసుకుంది..అదే విషయాన్ని  పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించింది. పంచాయతీ పెద్దలు నాగేశ్‌ను మందలించడంతో వారిముందు  మంగను బాగా చూసుకుంటానని ఒప్పుకున్నాడు. భార్య పంచాయతీ పెట్టిదన్న పగతో ఉన్న నాగేశ్‌ గత నెల రోజుల కిందట ఇంట్లో ఉన్న పిండి పదార్ధాల్లో భార్య మంగకు తెలియకుండా భాస్వారం కలుపగా వంట చేసే సమయంలో గమనించి వాటిని బయట పడేసింది.దీంతో తన భార్య మంగకు పిచ్చిపట్టి ఇంట్లో వస్తువులను బయట పారేస్తుందంటూ గ్రామంలో అందరికి చెబుతూ వేదించడం మొదలు పెట్టాడు.మంగకు ఆరోగ్యం బాగులేదని, దెయ్యం పట్టిందని నగేశ్ ప్రచారం చేశాడు..దీనికోసం మంత్రాలు,పూజలు చేయించడానికి సిద్దమయ్యాడు.

ఒకరోజు ఉదయం తన పుట్టింటికి వెళ్లివస్తానని మంగ తన భర్త నాగేశ్‌ను అడగగా ఎక్కడికి వెళ్లేది లేదని తేల్చి చెప్పాడు.తర్వాత తనకు తెలిసిన ఓ మాంత్రికుడిని ఇంటికి తీసుకువచ్చాడు..ఆ వచ్చిన  మాంత్రికుడు ఇంట్లో ముగ్గు వేసి.. మంగను కూర్చోబెట్టబోతే మంగ దానికి నిరాకరించింది.. బలవంతంగా మత్తు ట్యాబ్లెట్స్‌ వేసి ముగ్గు వద్ద కూర్చోపెట్టారు..ఈ తతంగానికంతా. నగేష్ తల్లి కూడా సహకరించింది. నగేష్, మంత్రగాడు బెల్డ్‌తో మంగను కొట్టగా తీవ్ర గాయాలయ్యాయి.అంతేకాదు వంటి మీద వాతలు పెట్టారు..ఈ హింస భరించలేక మంగ భర్త, అత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.విషయం తెలుసుకున్న పోలీసులు మంగను హాస్పటల్లో జాయిన్ చేసి,మంగ అత్త,భర్తలను అదుపులోకి తీసుకున్నారు..

Comments

comments

Share this post

scroll to top