భార్య స్నానం చేయడం లేదని ఆ భర్త ఏం చేశాడో తెలుసా.? ఇలా కూడా చేస్తారా.?

భార్యాభ‌ర్త‌ల‌న్నాక ప్ర‌తి విష‌యంలోనూ స‌ర్దుకుపోవాలి. ఒక‌ర్నొక‌రు అర్థం చేసుకోవాలి. చిన్న స‌మస్య వ‌చ్చినా స‌ర్దుకుపోయే మ‌న‌స్త‌త్వం ఉంటేనే వారి కాపురం అన్యోన్యంగా సాగుతుంది. అలా లేక‌పోతే ఎవ‌రి సంసారంలో అయినా క‌ల‌హాలు వ‌స్తాయి. అప్పుడు అవి మ‌రింత తీవ్ర‌త‌ర‌మైతే ఇక విడాకుల వ‌ర‌కు ప‌రిస్థితి దారి తీస్తుంది. అయితే ప్ర‌పంచంలో ఎంతో మంది భార్యాభ‌ర్త‌లు అనేక కార‌ణాల వ‌ల్ల విడాకులు తీసుకుంటూ ఉంటారు. వాటిల్లో కొంత మంది కొన్ని సార్లు చెప్పే కార‌ణాలు నిజంగా ఎదుటి వారికి చాలా సిల్లీగా, ఫ‌న్నీగా అనిపిస్తాయి. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా ఇలాంటి ఓ ఫ‌న్నీ కార‌ణం గురించే. కాక‌పోతే దాన్ని సిల్లీ అని, ఫ‌న్నీ అని అన‌లేం. ఎందుకంటే… ఆ భ‌ర్త భ‌రించిన బాధ అలాంటిది మ‌రి. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

తైవాన్‌లో ఓ వ్య‌క్తి ఇటీవ‌లే త‌న భార్య నుంచి త‌న‌కు విడాకులు ఇప్పించాల‌ని కోర్టుకెక్కాడు. ఈ క్ర‌మంలో కోర్టు విడాకుల‌కు కార‌ణం అడ‌గ్గా అత‌ను త‌న బాధ‌ను వెళ్ల‌బోసుకున్నాడు. అత‌ను త‌న భార్య‌ను ప్రేమించే పెళ్లి చేసుకున్నాడ‌ట‌. పెళ్లికి ముందు త‌న భార్య వారానికోసారి స్నానం చేసేద‌ట‌. అయినా అత‌ను ఇష్ట‌ప‌డ్డాడు క‌నుక‌, ఫ‌ర్వాలేద‌ని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్ల‌య్యాక ఆమెకు ఏమైందో ఏమో తెలియ‌దు కానీ పెళ్ల‌యిన‌ప్ప‌టి నుంచి ఆమె ఏడాదికోసారి స్నానం చేయ‌డం మొద‌లు పెట్టింద‌ట‌.

అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఆ వ్య‌క్తి భార్య పెళ్ల‌య్యాక ఏడాదికోసారి స్నానం చేసేద‌ట‌. అలా చేసిన‌ప్పుడు ఏకంగా 6 గంట‌ల పాటు స్నానం చేస్తుంద‌ట‌. ఇక నిత్యం దంతాలు కూడా తోముకోద‌ట. దీంతో ఆ అల‌వాట్ల‌ను మార్చుకుని శుభ్రంగా ఉండ‌మ‌ని తాను చాలా సార్లు చెప్పాన‌ని, అయినా ఆమె త‌న మాట విన‌నందున వేరే ద‌గ్గ‌రికి వెళ్లి నివాసం ఉంటున్నాన‌ని, అయిన‌ప్ప‌టికీ అక్క‌డికి కూడా ఆమె వ‌చ్చి త‌న‌ను స‌తాయిస్తుంద‌ని కాబ‌ట్టి త‌న‌కు ఆమె నుంచి విడాకులు ఇప్పించాల‌ని అత‌ను కోర్టులో న్యాయ‌మూర్తిని కోరాడు. దీంతో న్యాయ‌మూర్తి కూడా మొద‌ట్లో షాక్ అయినా ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గానే తీసుకున్నార‌ట‌. వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త అనేది ఎవ‌రికైనా అత్యంత ఆవ‌శ్య‌కం క‌నుక ఆమెకు ఆ జ్ఞానం లోపించినందున జ‌డ్జి కూడా ఆ వ్య‌క్తికి అనుకూలంగా తీర్పునిచ్చి అత‌ను కోరిన‌ట్టుగానే విడాకులు ఇప్పించే ప‌నిలో ప‌డిన‌ట్టు తెలిసింది. ఏది ఏమైనా.. నిజంగా ఇలాంటి భార్య‌లు లేదా భ‌ర్త‌లు మాత్రం ఎవ‌రికీ ఉండ‌కూడదు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top