భార్య శవాన్ని మోస్తూ 10 KM నడిచిన వ్యక్తి.! ఇతడి దయనీయ పరిస్థితి విన్నాక ఆ ఆసుపత్రి సిబ్బందిని ఏమనాలో మీరే డిసైడ్ చేయండి.

ఓ వ్యక్తి తన భుజాలపై ఓ  శవాన్ని మోసుకొని నడుచుకుంటూ వస్తున్నాడు, అతని వెంట 12 యేళ్ల కూతురు కూడా ఉంది. ఈ దృశ్యాలను గమనించిన స్థానికి మీడియా ప్రతినిధులు విషయం ఆరా తీశారు . వారితో  ఆ వ్యక్తి ఏడ్చుకుంటూ తన ధైన్యాన్ని ఇలా వ్యక్తం చేశాడు.” సార్ నా పేరు దానామాంజీ, ఇది నా భార్య అమంగ్ దేవి. నాభార్య గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగాలేకపోవడంతో…. భవానీ పట్న ప్రభుత్వాసుపత్రిలో చేర్చించాను. మాది ఇక్కడి నుండి 60 KM  దూరంలో ఉండే  ఎజెన్సీ ప్రాంతమైన మేల్ఘారా.. తెచ్చుకున్న కొన్ని డబ్బులు వచ్చేటప్పుడు దారి ఖర్చులకు, నా భార్య మందులకే అయిపోయాయి. నిన్న రాత్రి డాక్టర్లు వచ్చి  మీభార్యకు క్షయ వచ్చింది. దాని కారణంగా చనిపోయిందని చెప్పి వెళ్లిపోయారు . ప్రాణంగా చూసుకున్న భార్య చనిపోయింది. ఇంటికెళ్దాం అంటే చేతిలో చిల్లిగవ్వ లేదు.. ….నా భార్యను మా ఊరు తీసుకెళ్లి అంత్యక్రియలు చేసుకుంటాను సహాయం చేయండని , అక్కడి డాక్టర్లను ప్రాధేయపడ్డాను. వాళ్లు కనికరించలేదు,రోడ్డు మీదకొచ్చి కూడా   చాలా మందిని అడిగాను, తాగుడు అలవాటైన వారికి ఇదో ట్రిక్ అని చాలా మంది నా మొహాన్నే ఛీ కొట్టారు. దాంతో చేసేదేమీ లేక.. నా భార్య శవాన్ని దుప్పటిలో కప్పి..మా ఊరికి ప్రయాణమయ్యాను…ఇప్పటికే దాదాపు 10-12 KM లు కాలినడకన వచ్చాము…ఇంకో 50 KM నడిస్తే మా ఊరు వచ్చేస్తుంది. నా భార్య అంత్యక్రియలు నా ఊర్లో చేస్తా” అంటూ తడారిన గొంతుతో, కన్నీళ్లను తుడచుకుంటూ చెప్పాడు మాంజీ.

Dead wife on shoulders

దానామాంజీ మాటలువిని చలించిపోయిన స్థానిక మీడియా ప్రతినిధులు కలెక్టర్ కు ఫోన్ కలిపారు. ఫోన్ పెట్టేసిన  30 నిమిషాల్లో వారున్న ప్రాంతానికి  ఓ అంబులెన్స్ వచ్చి…. వారిని 50 KM దూరంలో ఉన్న వారింటికి చేర్చింది. అదేవిధంగా హరిశ్చంద్ర యోజన పథకం కింద అంత్యక్రియలకు సహాయం చేయాలని స్థానిక అధికారులను  ఆదేశించారు  భవానీ పట్న కలెక్టర్.

మరో విషయం ఏంటంటే…ఒరిస్సాలో ఓ పథకాన్ని ఇటీవలే ప్రవేశపెట్టింది  అక్కడి ప్రభుత్వం, అంతే కాదు ఆ పథకం గురించి చాలా సందర్భాల్లో గొప్పలు కూడా చెప్పుకుంది ..ఆ పథకం పేరు  మహాప్రయాణ పథకం…దీని ప్రకారం చనిపోయిన వ్యక్తులను వారి వారి స్వస్థలాలకు ఉచితంగా చేర్చుతారు . ఈ పథకం అమలులోనే ఉంది…అయినా అంతగా ప్రాధేయపడ్డ అతడి విన్నపాలు మాత్రం అక్కడి హాస్పిటల్ సిబ్బందికి వినిపించలేదు. మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం మానవుని లక్షణం..దాన్ని మరిచిన ఆ హాస్పిటల్ సిబ్బందిని ఏమనాలో మీరే చెప్పండి.
Note: లోకంలో జరుగుతున్న సంఘటనల గురించి డైరెక్ట్ గా మీ వాట్సాప్ లో చదవాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ 7997192411 అనే నెంబర్ కు START అని మెసేజ్ చేయండి.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top