భార్య రూ.2 లక్షల కట్నం ఇవ్వలేదని ఆ భర్త ఆమెకు తెలియకుండా ఏం చేసాడో తెలుసా.? ఆమెకు కడుపు నొప్పి తీవ్రంగా వస్తే..!

కట్నం కోసం భార్యలను చిత్ర హింసలు పెట్టిన, పెడుతున్న ఎంతో మంది మృగాళ్ల లాంటి భర్తల గురించి మనం నిత్యం వార్తల్లో తెలుసుకుంటూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అయినా వీటిని ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. దీంతో మృగాళ్ల బారిన పడి మహిళలు వేధింపులను, చిత్ర హింసలను ఎదుర్కొంటున్నారు. కొందరైతే ప్రాణాలనే కోల్పోతున్నారు. అయితే ఆ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ మాత్రం తన భర్త వల్ల ఓ కిడ్నీని కోల్పోయింది. ఆ ప్రబుద్ధుడు తన భార్యకు తెలియకుండానే ఆమె కిడ్నీని కాజేసి అమ్ముకున్నాడు. దీంతో ఈ విషయం తెలిసిన బాధితురాలు ఇప్పుడు పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు.

వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన రీటా సర్కార్‌కు గత రెండు సంవత్సరాల కిందట బిస్వజిత్‌ సర్కార్‌ అనే వ్యక్తితో పెళ్లయింది. అయితే పెళ్లయిన నాటి నుంచి రీటాను బిస్వజిత్‌ వేధింపులకు గురి చేసే వాడు. తనకు ఇస్తానన్న రూ.2 లక్షల కట్నం ఇవ్వమని నిత్యం వేధించేవాడు. చిత్ర హింసలకు గురి చేసేవాడు. ఈ క్రమంలో బిస్వజిత్‌ సోదరుడు శ్యామల్‌, తల్లి బులరాణిలు కూడా రీటాను వేధించేవారు. అయినా ఆమె అన్నింటినీ భరిస్తూ వచ్చింది. అయితే 2016లో ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి వస్తే కోల్‌కతాలో ఉన్న ఓ ప్రైవేటు నర్సింగ్‌ హోంలో ఆమెను భర్త చేర్పించాడు. డాక్టర్లు ఆమెకు అపెండిక్స్‌ సర్జరీ చేశారు.

అలా రీటాకు అపెండిక్స్‌ సర్జరీ అయింది. అయితే అదే అదనుగా భావించిన రీటా భర్త బిస్వజిత్‌ డాక్టర్లతో కుమ్మక్కై రీటాకు తెలియకుండా ఆమెకు కిడ్నీ ఆపరేషన్‌ చేసి ఒక కిడ్నీ తీయించాడు. అనంతరం దాన్ని చత్తీస్‌గడ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు రూ.2 లక్షలకు అమ్మాడు. అయితే అలా సర్జరీ అయినట్టు రీటాకు తెలియదు. ఆమెకు భర్త కాదు కదా, ఆ హాస్పిటల్‌ డాక్టర్లు కూడా చెప్పలేదు. అలా చెప్పకుండా బిస్వజిత్‌ డాక్టర్లతో కుట్ర పన్నాడు.

అయితే తాజాగా మళ్లీ రీటాకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఈ సారి తన బంధువులతో కలిసి నార్త్‌ బెంగాల్‌ మెడికల్‌ కాలేజీలో ఉన్న హాస్పిటల్‌కు వెళ్లి చెక్‌ చేయించుకుంది. అక్కడ ఆమెకు టెస్ట్‌లు చేసిన వైద్యులు ఒక కిడ్నీ లేదని చెప్పారు. దీంతో ఆమెకు అసలు విషయం తెలిసింది. అలా తన కిడ్నీ ఒకటి అమ్ముకున్నారని ఆమెకు తెలియడంతో భర్త, అతని సోదరుడు, తల్లిపై రీటా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఐపీసీ సెక్షన్‌ 19 (అవయవాలను అక్రమంగా అమ్ముకోవడం), సెక్షన్‌ 21 (అవయవ దానం వ్యాపారం చేయడం), సెక్షన్‌ 307 (అటెంప్టివ్‌ మర్డర్‌), 498 (మహిళను వేధింపులకు గురిచేయడం, గృహ హింస) ల కింద బిస్వజిత్‌, శ్యామల్‌లను అరెస్ట్‌ చేశారు. బిస్వజిత్‌ తల్లి బులరాణి పరారీలో ఉంది. ఇక మీరే చెప్పండి ఇలాంటి వారినేం చేయాలో. ఏది ఏమైనా ఇలా మహిళలను వేధించే వారిని మాత్రం అస్సలు వదలకూడదు. ఇప్పుడు కిడ్నీని కోల్పోయిన రీటా పడుతున్న వేదన అంతా ఇంతా కాదు..!

Comments

comments

Share this post

scroll to top