ఆమె త‌న భ‌ర్త మంచివాడు కావాల‌నుకుంది, కానీ అత‌ను ఆమెను బిల్డింగ్ పైనుండి తోసేసాడు.! అసలేమైంది.?

భార్యాభ‌ర్త‌ల్లో భార్య ఎప్పుడూ భ‌ర్త క్షేమాన్నే కోరుకుంటుంది. భ‌ర్త ఆరోగ్యంగా ఉండాల‌ని, కుటుంబం హ్యాపీగా జీవించాల‌ని భార్య అనుకుంటుంది. కానీ కొంద‌రి జీవితాల్లో మాత్రం సంతోషం క‌రువ‌వుతుంది. అందుకు భ‌ర్త తాగుడు, ఇత‌ర వ్య‌వ‌స‌నాలే కార‌ణం. ఈ క్ర‌మంలోనే ఇవే వ్య‌స‌నాల‌తో ఓ మృగాడు త‌న భార్య‌ను చంపాల‌ని చూశాడు. చివ‌ర‌కు ఆ ప్ర‌య‌త్నం విఫ‌లం కావ‌డంతో ఇప్పుడు క‌ట‌క‌టాల వెనుక ఉన్నాడు. ఇంత‌కీ అస‌లు జ‌రిగిన విష‌యం ఏమిటంటే…

చ‌త్తీస్‌గ‌డ్‌లోని చంపా జిల్లాకు చెందిన వినోద్ దేవాంగ‌న్‌, హేమ‌ల‌త‌కు 2014లో వివాహం అయింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అత‌ని వ‌య‌స్సు రెండున్న‌ర సంవ‌త్స‌రాలు. పేరు యువ‌రాజ్‌. అయితే దేవాంగ‌న్‌కు విప‌రీతంగా మ‌ద్యం సేవించే అల‌వాటు ఉంది. దీనికి తోడు అత‌ను బెట్టింగ్ వ్య‌స‌నానికి కూడా బానిస అయ్యాడు. ఈ క్రమంలో ఈ రెండు వ్య‌స‌నాల వ‌ల్ల అత‌ను అటు ఆరోగ్యాన్ని, ఇటు డ‌బ్బును కోల్పోయేవాడు. ఇది గ‌మ‌నించిన అత‌ని భార్య హేమ‌ల‌త త‌ర‌చూ వినోద్‌కు మ‌ద్యం మానేయ‌మ‌ని, బెట్టింగ్ జోలికి వెళ్ల‌వ‌ద్ద‌ని చెప్పేది.

అయితే హేమ‌ల‌త ఎంత చెప్పినా దేవాంగ‌న్ విన‌క‌పోయేవాడు. రోజూ అలాగే పీక‌ల‌దాకా మ‌ద్యం సేవించి వ‌చ్చి హేమల‌త‌ను హింసించే వాడు. అయితే ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన కూడా అలాగే దేవాంగ‌న్ మ‌ద్యం సేవించి రాత్రి 1 గంట‌కు ఇంటికి వ‌చ్చాడు. దీంతో దేవాంగ‌న్‌కు, హేమ‌ల‌త‌కు మ‌ధ్య తీవ్ర‌మైన వాగ్వివాదం ప్రారంభ‌మై అది గొడ‌వకు దారి తీసింది. ఈ క్ర‌మంలో ఓ ద‌శ‌లో స‌హ‌నం కోల్పోయిన దేవాంగ‌న్ తాము ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని రెండో అంత‌స్తు నుంచి భార్య‌ను కింద‌కు తోసే య‌త్నం చేశాడు. అయితే అదృష్ట‌వ‌శాత్తూ హేమ‌ల‌త అత‌ని బారి నుంచి త‌ప్పించుకుని గాయాల పాలైంది. దీంతో స్థానికులు ఆమెను హాస్పిట‌ల్ చేర్చారు. చికిత్స అనంతరం హేమ‌ల‌త త‌న భ‌ర్త‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దేవాంగ‌న్‌పై కేసు న‌మోదు చేసుకుని అత‌న్ని అరెస్టు చేశారు. నిజంగా ఇలాంటి వారు అస‌లు స‌మాజానికి అవ‌స‌రం అంటారా.. మీరే చెప్పండి..!

Comments

comments

Share this post

scroll to top