తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భర్త చెప్పిన పార్టీ కి ఓటు వెయ్యలేదని భార్య చిటికెన వేలుని కోసేసిన భర్త..!!

ఓటు మానవ హక్కు, అభ్యర్థులలో మనకి ఇష్టం ఉన్న వాళ్ళకి ఓటు వేయొచ్చు, ఒక వేళ ఎవ్వరి మీదా నమ్మకం రాకపోతే నోటా కి ఓటు వేయొచ్చు, కానీ చెప్పిన వారికి ఓటు వెయ్యలేదని దాడి చెయ్యకూడదు. భర్త చెప్పిన పార్టీ కి భార్య ఓటు వెయ్యలేదని భార్య పైన కత్తి తో దాడి చేసాడు భర్త.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మండలంలోని సర్వాయిపేటలో వుంటున్న ఓ జంట ఎన్నికల సందర్భంగా ఓ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకుంది. ఓటింగ్ పూర్తయ్యాక తాను చెప్పిన పార్టీకి భార్య ఓటు వెయ్యలేదని తెలుసుకున్న భర్త కోపంతో ఊగిపోయాడు. భార్య పైన కత్తి తో దాడి చేసాడు, భార్య వెంట పడి మరి తన పైన దాడి చేసాడు, దాడి చేస్తున్న సమయం లో చెయ్యి అడ్డం పెట్టింది, అంతే కత్తి చిటికిన వేలుకి తగిలి తెగిపడింది. అయితే ఈ సంఘటన గురుంచి తమకు ఎవ్వరు ఫిర్యాదు చెయ్యలేదని పోలీస్ లు తెలిపారు.

మన దేశం లో భర్త మీద ఫిర్యాదు చేసే భార్యలు చాల అరుదుగా కనిపిస్తారు, అందుకే అడ్డగోళంగా ఇష్టానుసారంగా మహిళలను హింసిస్తూ ఉంటారు, మంచిగా ఉండే భర్త తో కాపురం చెయ్యకుండా వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను చంపేసే వారి సంఖ్యా కూడా గణనీయంగా పెరుగుతుంది. మంచిగా ఉండే మొగవాళ్ళని దూరం పెట్టడం, చెడ్డ వాళ్ళకి ఆకర్షితులవ్వడం ఆనవాయితీ అయిపోయింది ఆడవాళ్ళకి.

Comments

comments

Share this post

scroll to top