షమీ కేసులో కొత్త ట్విస్ట్: “అందుకే నా భర్తతో కలిసే ఉండాలనుకుంటున్నా.!” – హసీన్.!

క్రికెటర్  మహ్మద్  షమీ  భార్య  హసీన్  జహా.. తన భర్తతో  కలిసే  ఉండాలని  కోరుకుంటున్నట్టు  చెప్పింది. హింసించాడంటూ  సాక్ష్యాలతో  సహా  ఇప్పటికే  ముందుకు  వచ్చిన హసీన్.. తన  భర్తలో మార్పు కోరుకుంటున్నట్టు  తెలిపింది.  నాలుగేళ్లుగా  షమీలో  మార్పు కోసం  ఎదురు చూస్తున్నట్టు  చెప్పింది. కానీ.. అందుకు  షమీ సిద్ధంగా  లేడని  ఆవేదన చెందింది.

ఇదే విషయంపై షమీ స్పందించాడు. తన కాపురాన్ని చక్కదిద్దుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని  ప్రకటించాడు. తనపై భార్య హసీన్ జహాన్ వరుసగా చేస్తున్న ఆరోపణలపై ఆదివారం (మార్చి-11) స్పందించిన షమీ.. సమస్య చర్చల ద్వారా పరిష్కారమవుతుందనుకుంటే అంతకుమించిన మంచిపని మరొకటి ఉండదన్నాడు. సమస్య పరిష్కారం కావాలనే తాను కోరుకుంటున్నానని, అది తమకు, తమ కుమార్తెకూ మంచిదన్నాడు షమీ.

Comments

comments

Share this post

scroll to top