భర్తను చీటింగ్…పోలీస్ తో డేటింగ్..! ఫేస్ బుక్ లో మరొకరి భార్యను ఆ కానిస్టేబుల్ ఎలా వలలో వేసుకున్నాడో చూడండి!

మొన్నటికి మొన్న జరిగిన ఎసిపి,సిఐ ల ఘటన మరువనేలేదు తాజాగా మరో ఖాకీ రాసలీలలు బయటపడ్డాయి..ఫేస్ బుక్ లో మహిళకు వలవేసి,ప్రేమిస్తున్నా అంటూ మాయమాటలు చెప్పి,భార్యభర్తల్లానే చెట్టాపట్టాలేసుకుని తిరిగిని వైనం బయటపడింది…కామాంధులను అడ్డుకోవాల్సిన పోలీసులే కామక్రీడల్లో మునిగి తేలిపోతున్నారు. కామవాంఛలు తీర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులు రాసలీలల్లో మునిగిపోతూ పోలీస్‌ శాఖ పరువును గంగలో కలుపుతున్నారు..

హైదరాబాద్‌ లోని  మొఘల్‌పురా పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగం చేస్తున్న సందీప్..స్నేహ అనే యువతిని ప్రేమ ముగ్గులోకి దించాడు.సందీప్ చెప్పే కల్లబొల్లి మాటలకు స్నేహ కూడా ఫిదా అయిపోయింది.వీరిద్దరి పరిచయానికి వేదికైంది ఫేస్ బుక్.అయితే స్నేహకు ఆల్రెడీ పెళ్లై,ఒక బాబుకూడా ఉన్నాడు.హాయిగా భర్తతో కాపురం చేసుకుంటున్న స్నేహ కాపురంలో చిచ్చుపెట్టాడు సందీప్. .గుట్టుగా సాగుతున్న స్నేహ, సందీప్‌ల ప్రేమాయణం భర్త నాగరాజుకు తెలిసింది. తీరు మార్చుకోవాలని భార్యకు భర్త ఎన్నో రకలుగా చెప్పిచూశాడు. అయినా పద్ధతి మార్చుకోకపోవడంతో భర్త నాగరాజు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేస్తూ సందీప్‌తో ప్రేమాయణం నడుపుతోందని నాగరాజు చెప్పాడు.

ఇక్కడే కథ అడ్డం తిరిగింది..తమ మీద కేసు పెట్టాడని తెలియగానే స్నేహ అలర్ట్ అయి భర్తపైన అదనం కట్నం కోసం వేధిస్తున్నాడని కేసు పెట్టింది..మరొవైపు కానిస్టేబుల్‌ సందీప్‌ రాసలీలల వ్యవహారం ఉన్నతాధికారులకు తెలియడంతో.. అతన్ని మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌ నుంచి హెడ్‌ క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు.గత్యంతరం లేని పరిస్థితిలో నాగరాజు మీడియాను ఆశ్రయించి ,తన భార్య,సందీప్ కలిసి దిగిన ఫోటోలు,చేసిన ఛాటింగ్ బయటపెట్టాడు..దీంతో అలర్ట్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సారి నాగరాజు ఫిర్యాదుని సీరియస్ గా తీసుకుంది.

source: mojotv

Comments

comments

Share this post

scroll to top