భర్తను చంపించిన భార్య సరస్వతి.అరెస్టయిన ప్రియుడు, కథలో బయటపడ్డ మరో ట్విస్టు..

పెళ్లి జరిగి పట్టుమని పది రోజులు కూడా కాలేదు పసుపు కుంకుమలు దూరమయ్యాయే అనుకున్నారు అంతా విజయనగరం సరస్వతిని చూసి..కాని స్వాతి,జ్యోతి,శ్రీవిద్య బాటలో సరస్వతి కూడా ప్రియుడి కోసం తన భర్తని పొట్టన పెట్టుకుందని తెలిశాక ముఖం మీదే ఉమ్మేసినంత పనిచేశారు.ప్రియుడితో కలిసి భర్తని మట్టుపెట్టిన సరస్వతి కేసులో మరో కొత్త ట్విస్టు బయటపడింది అదేంటంటే..

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి ఐటీడీఏ ఉద్యానవనం వద్ద మే 7న రాత్రి శంకర్రావు హత్య  జరిగిన విషయం తెలిసిందే.భార్య సరస్వతి,తన ప్రియుడు శివలు మరికొందరు నిందితులతో కలిసి ప్లాన్ ప్రకారం చంపేసి, దారి దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. .గౌరీ శంకర్రావుతో పెళ్లికి ముందే సరస్వతి శివని  ప్రేమించింది..పెద్దలు తనకు ఇష్టం లేని పెళ్లి చేయడంతో భర్తను మట్టుపెట్టాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసి ఆ మర్డర్ ని దారిదోపిడిగా చిత్రీకరించింది.దొరికిపోయిన నిందితులు చెప్తున్న స్టోరీకి,సరస్వతి చెప్తున్న కథనానికి సంభందం లేకపోవడంతో ఆరా తీయగా అసలు విషయాలు బయటికి వచ్చాయి..సరస్వతిని అదుపులోకి తీసుకోగా శివ విజయవాడలో పట్టుబడ్డాడు.సరస్వతితో పరిచయానికి ముందే శివకి నేరచరిత్ర ఉంది.మరొక అమ్మాయిని మోసం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి.అయినప్పటికి శివతో జీవితానికే సరస్వతి మొగ్గుచూపింది.అందులో భాగంగానే తనే దగ్గరుండి మరీ చంపించింది.

అయితే ఈ మొత్తం కథలో మరో ట్విస్టు బయటపడింది.అదేంటంటే భర్త శంకర్ బెంగళూరులోని ఓ ప్రముఖ పవర్ పాయింట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతని పేరుతో కొన్ని ఇన్సురెన్స్, ఎల్ఐసీ పాలసీలు ఉన్నాయి. తాజాగా ఈ విషయం కూడా వెలుగు చూసింది. ప్రియుడితో పాటు ఇంటి నుంచి పారిపోతే ఎలాంటి లాభం లేదని భావించి, భర్తను చంపేసి, ఎవరో హత్య చేశారని చెబితే సానుభూతి వస్తుందని, దాంతో పాటు ఇన్సురెన్స్, ఎల్ఐసీ డబ్బులు వస్తాయని ప్లాన్ చేసి ఉండుంటారని భావిస్తున్నారు.

 

 

Comments

comments

Share this post

scroll to top