సినిమాని మించిన ట్విస్టులు…భ‌ర్త‌ను చంపి…అత‌ని స్థానంలో ప్రియున్నితేవాలనుకుంది.! కానీ చివ‌ర‌కు.!

బాబోయ్‌.. నేటి త‌రుణంలో జ‌నాలు చాలా తెలివి మీరారు. మ‌రీ ముఖ్యంగా నేరాలు చేయ‌డంలో. కొత్త కొత్త ఐడియాల‌తో వారు నేరాలు చేస్తున్నారు. అలాంటి వారికి సినిమాలు కూడా ప్రేర‌ణ‌గా నిలుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా పూర్తిగా కొత్త త‌ర‌హాలో నేరాల‌కు పాల్ప‌డుతున్నారు. స‌రిగ్గా ఇదే త‌ర‌హాలో తాజాగా ఓ నేరం చేసింది ఓ మ‌హిళ‌. భ‌ర్త‌ను చంపేసి అత‌ని స్థానంలో ప్రియుడిని తీసుకురావాలనుకుంది. అందులో భాగంగానే ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను అంతం చేసింది. త‌రువాత ప్రియున్ని ఆ స్థానంలోకి ర‌ప్పించింది. అయితే నేరం ఎప్ప‌టికీ దాగ‌దు క‌దా, చివ‌ర‌కు ఆమె చేసిన నేరం బ‌య‌ట ప‌డింది. అచ్చం ఎవ‌డు సినిమా స్టోరీని ఈ క్రైం త‌ల‌పిస్తుంది.

ఆ దంప‌తుల‌ పేర్లు స్వాతి, సుధాక‌ర్ రెడ్డి. నాగ‌ర్‌క‌ర్నూల్ వాసులు. కాగా 2 సంవ‌త్స‌రాల క్రితం స్వాతి న‌డుం నొప్పితో బాధ‌ప‌డుతూ ఫిజియోథెర‌పిస్ట్ అయిన రాజేష్ వ‌ద్ద‌కు వెళ్లింది. అలా ఆమెకు, రాజేష్‌కు మ‌ధ్య ప‌రియం ఏర్ప‌డి అది కాస్తా వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. అయితే మొన్నీ మ‌ధ్యే న‌వంబ‌ర్ 26వ తేదీన రాజేష్‌, స్వాతి ఇద్ద‌రూ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ వెళ్లారు. అక్క‌డ వీళ్ల‌ను సుధాక‌ర్ రెడ్డి స్నేహితులు చూసి సుధాక‌ర్ రెడ్డికి స‌మాచారం ఇచ్చారు. దీంతో ఇంటికి రాగానే స్వాతిని సుధాక‌ర్ రెడ్డి నిలదీయ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. ఈ క్ర‌మంలో అప్ప‌టి నుంచి భ‌ర్త‌ను వ‌దిలించుకోవాల‌ని స్వాతి ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌చ్చింది.

అయితే చూసేందుకు స్వాతి భ‌ర్త సుధాక‌ర్ రెడ్డి, ప్రియుడు రాజేష్‌లు ఇద్ద‌రూ దాదాపుగా ఒకేలా ఉంటారు. దీంతో స్వాతికి ఒక ఐడియా వ‌చ్చింది. ఎవ‌డు సినిమాలో పూర్తిగా కాలిపోయిన అల్లు అర్జున్ బాడీకి రామ్ చ‌ర‌ణ్ ముఖం అతికిస్తారు క‌దా. దాన్ని దృష్టిలో ఉంచుకుని త‌న భ‌ర్త‌ను చంపేసి అత‌ని స్థానంలో అత‌నిలాగే ఉండే త‌న ప్రియుడు రాజేష్‌ను తేవాల‌ని అనుకుంది. ఇంకేముందీ వెంట‌నే ప‌థ‌కం వేసింది. ప్రియుడు రాజేష్‌తో క‌లిసి భ‌ర్త‌ను అంత‌మొందించింది. త‌రువాత ప్రియుడు రాజేష్‌ ముఖంపై అక్క‌డ‌క్క‌డ యాసిడ్ పోసింది. అనంత‌రం త‌న భ‌ర్త‌పై ఎవ‌రో యాసిడ్ దాడి చేశార‌ని సీన్ క్రియేట్ చేసింది. కానీ అస‌లు నిజానికి ఆమె యాసిడ్ వేసింది రాజేష్ పైనే. కానీ భ‌ర్త‌పై యాసిడ్ దాడి జ‌రిగింద‌ని చెప్పింది. ఈ క్ర‌మంలో రాజేష్ ముఖం గుర్తు ప‌ట్ట‌కుండా త‌యారు కావ‌డంతో అంద‌రూ అత‌న్ని సుధాకర్ రెడ్డి అనుకున్నారు. అలా కొద్ది రోజులు గ‌డిచాయి.

అయితే నేరం ఎప్ప‌టికీ దాగ‌దు క‌దా. చివ‌ర‌కు అది ఎలాగైనా బ‌య‌ట ప‌డే తీరుతుంది. యాసిడ్ గాయాల వ‌ల్ల ఆస్ప‌త్రిలో సుధాక‌ర్ రెడ్డిలా చెలామ‌ణీ అవుతూ చికిత్స పొందుతున్న రాజేష్‌పై సుధాక‌ర్ రెడ్డి తల్లిదండ్రుల‌కు అనుమానం వ‌చ్చింది. అస‌లు అత‌ను త‌మ కొడుకు సుధాక‌రేనా అని వారు సందేహం వ్య‌క్తం చేశారు. వెంట‌నే పోలీసుల‌కు ఈ విష‌యం చెప్పారు. దీంతో వారు సీక్రెట్‌గా విచార‌ణ చేప‌ట్టారు. అయితే చివ‌ర‌కు హాస్పిట‌ల్‌లో బిల్ క‌ట్టే స‌మ‌యంలో ఆధార్ కార్డు సేక‌రించారు. దీంతో గాయాల‌తో ఉన్న‌ది రాజేష్ అని తెలిసింది. అనంత‌రం పోలీసులు త‌మ దైన శైలిలో విచార‌ణ చేయ‌గా నిందితులు స్వాతి, రాజేష్‌లు అస‌లు విష‌యం ఒప్పుకున్నారు. ఈ క్ర‌మంలో త‌మ కొడుకును అన్యాయంగా పొట్ట‌న పెట్టుకుంద‌ని కోడ‌లు స్వాతిపై ఆమె అత్త‌మామ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొడుకును పోగొట్టుకున్నందుకు వారు క‌న్నీరు మున్నీర‌వుతున్నారు. ఏది ఏమైనా అక్ర‌మ సంబంధాలు చివ‌ర‌కు విషాదాలుగా మారుతాయ‌ని ఈ సంఘ‌ట‌న మ‌న‌కు తెలియ‌జేస్తుంది.

Comments

comments

Share this post

scroll to top