మొన్న స్వాతి…ఇప్పుడు జ్యోతి..! ప్రియుడు కోసం భర్తకు పాలల్లో నిద్రమాత్రలు కలిపి..చివరికి ఏం చేసిందంటే.?

నాగర్ కర్నూల్‌లో ప్రియుడితో కలిసి భర్త సుధాకర్ రెడ్డిని చంపిన స్వాతి కేసు మరువక ముందే చౌటుప్పల్లో మరో స్వా(జ్యో)తి భర్తపై దారుణానికి ఒడిగట్టింది. హైదరబాద్‌లోని చౌటుప్పల్ లో కార్పెంటర్ గా పనిచేస్తున్న నాగరాజు కొన్ని రోజులు క్రితం చనిపోయాడు. అయితే పోలీసులు విచారణ చేపట్టగా కొన్ని అనుమానాలు రేకెత్తాయి. అయితే మొన్న నాగరాజు తెలిసిన వ్యక్తి ఒకరు ఆత్మహత్యా ప్రయత్నం చేయడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి.


నాగరాజు భార్య జ్యోతి.. ప్రియుడు కార్తీక్ కోసం తన భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి చంపినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీనితో జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ‘నాతప్పేం లేదని కార్తీకే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, నేను నా భర్తను వదిలేసి రాను, కావాలంటే ఫోన్లో మాట్లాడుకుందాం అని కార్తీక్‌కు చెప్పాను. కానీ నా చేతికి నిద్రమాత్రలు ఇచ్చి నాభర్తకు పాలల్లో కలిపి ఇవ్వమన్నాడు. ఇందులో నాతప్పేం లేదు, నాభర్తను నేను చంపలేదు, కార్తీక్ చెప్పినట్టు చేశాను’ అని జ్యోతి పోలీసుల విచారణలో ఒప్పుకుంది. మొన్న స్వాతి, ఈరోజు జ్యోతి ఇలా ఎందరో పరాయి వ్యక్తుల మోజులో పడి బంగారంలాంటి సంసారాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు.

Comments

comments

Share this post

scroll to top