భర్త స్థానంలో ప్రియుడిని తీసుకొచ్చిన “స్వాతి” గుట్టుబయటపెట్టింది “మటన్ సూప్”..! ఎలాగో తెలుసా.?

ప్రియుడి కోసం భర్తను హత్యచేసి.. అతని స్థానంలో ప్రియుడిని తీసుకు రావటానికి ప్రయత్నించిన కాలాంతకురాలు స్వాతి ఎపిసోడ్ లో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. అంత ప్లాన్డ్ గా భర్తను హత్య చేసినా.. పోలీసులకు ఆమె దొరికిపోవడానికి కారణం మటన్ సూప్. ఆశ్చర్యంగా ఉంది కదా.. అవును స్వాతి, రాజేష్ నాటకానికి మటన్ సూప్ చెక్ పెట్టింది. వివరాల్లోకి వెళితే…

హైదరాబాద్‌లోని డీఆర్‌డీఏ అపోలో ఆస్పత్రిలో స్వాతి ప్రియుడు రాజేశ్‌ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా కాలిన గాయాలతో చికిత్స పొం దుతున్న వారికి ఆస్పత్రిలో మటన్‌ సూప్‌ ఇస్తుంటారు. చికిత్స పొందుతున్న రాజేశ్‌కు వైద్యులు మటన్‌సూప్‌ తాగించేందుకు యత్నించారు. కానీ తాను శాఖాహారినని మటన్‌ సూప్‌ తాగేందుకు నిరాకరించడంతో అక్కడే ఉన్న సుధాకర్‌ రెడ్డి తల్లిదండ్రులు కంగుతిన్నారు. వాస్తవంగా సుధాకర్‌రెడ్డికి మాంసాహారం ఇష్టం కాగా.. ఇప్పుడు వద్దన డం ఏమిటని వారు ఆలోచనలో పడ్డారు. అప్పుడే వారికి అనుమానమొచ్చింది. చికిత్స పొందుతోంది సుధాకర్‌రెడ్డి కాదని, మరొకరన్న సంగతి క్రమంగా వారిలో బలపడుతూ వచ్చింది.

విషయాన్ని హాస్పిటల్ సిబ్బందికి చెప్పడం.. వారి సాయంతో రాజేష్ వేలిముద్రలు తీసుకోవడం.. వాటిని పోలీసులకు అందించడం చకచకా జరిగిపోయాయి. వాళ్ల పరిశోధనలో ఆ వేలిముద్రలు సుధాకర్ రెడ్డివి కాదని… రాజేశ్ అనే వ్యక్తివని తేల్చారు. తర్వాత స్వాతిని అదుపులోకి తీసుకోవడం.. ఆమెను తమదైన శైలిలో ఇంటరాగేట్ చేయడంతో అసలు విషయం బయటపడింది.

ఇంతకూ అసలు విషయం ఏంటంటే… రాజేశ్ శాకాహారి కావడంతో.. అతను మటన్ సూప్ తీసుకునేవాడు కాదు. అలా వద్దనడమే స్వాతి, రాజేష్ నాటకం బటయపడేటట్టు చేసింది.

Comments

comments

Share this post

scroll to top