SHOCKING: పసికందును పక్కకి పడేసి, భర్తను కట్టేసి…ఆ మహిళను నలుగురు నీచులు రేప్ చేసారు..!

వారు నిజంగా మ‌నుషులైతే కాదు జంతువులు. నిజానికి జంతువులు అనే ప‌దం కూడా వారికి చాలా త‌క్కువే అవుతుంది. వారిని మృగాలు అనే అనాలి. మృగాలు కాబ‌ట్టే ఆ ప‌ని చేశాయి. ఇలాంటి మృగాల‌ను అస్స‌లు ఊరికే వ‌ద‌ల‌కూడదు. క‌ఠినంగా శిక్షించాల్సిందే. ఉరి తీసి మ‌రీ చంపాలి. వారి జ‌ననావ‌య‌వాల‌ను తీసేయాలి… ఇవీ… ఆ సంఘ‌ట‌న ప‌ట్ల నెటిజ‌న్లు అంటున్న మాట‌లు. అవును మ‌రి, విష‌యం అలాంటిది. నిజంగా మీకు ఈ సంఘ‌ట‌న గురించి తెలిస్తే మీరు కూడా అవే మాట‌లు అంటారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

అది ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్‌. ఈ నెల 7వ తేదీన అక్క‌డి ధ‌న్‌శ్రీ అనే గ్రామానికి చెందిన భార్య, భ‌ర్త ఇద్ద‌రు త‌మ 3 నెల‌ల ప‌సికందుతో క‌లిసి హాస్పిట‌ల్‌కు వెళ్లి తిరిగి ఇంటికి బైక్ పై వ‌స్తున్నారు. అయితే వారు వ‌స్తున్న విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన న‌లుగురు వ్య‌క్తులు వారి వ‌ద్ద‌కు వెళ్లి ముందు రోడ్డు బాగా లేద‌ని వేరే రోడ్డులో వెళ్లాల‌ని చెప్పారు. దీంతో ఆ భార్య భ‌ర్త వేరే రోడ్డులో ఇంటికి వెళ్ల‌డం మొద‌లు పెట్టారు. అయితే ఆ రోడ్డు బాగా నిర్మానుష్యంగా ఉంది. ఈ క్ర‌మంలో స‌ద‌రు న‌లుగురు వ్య‌క్తులు ఆ భార్య భ‌ర్త బైక్‌ను అట‌కాయించారు. అనంత‌రం ఆ భార్యాభ‌ర్త‌ల్లో భ‌ర్త‌ను కింద‌కు లాగారు. అత‌న్ని తాళ్ల‌తో క‌ట్టేశారు. వారి ప‌సికందును నేల‌పై ప‌డేశారు.

ఆ త‌రువాత ప‌క్క‌నే ఉన్న చెరుకు తోట‌లోకి ఆ మ‌హిళ‌ను తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. ఓ వైపు తాళ్ల‌తో క‌ట్టిప‌డేసి ఉన్న భ‌ర్త‌, మ‌రో వైపు ఏడుస్తూ ప‌డి ఉన్న ప‌సికందు. ఇంకో వైపు ఆ మృగాళ్ల అఘాయిత్యం. వెర‌సి ఆ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. దీంతో బాధితులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, వారు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి కీచ‌కుల‌ను మాత్రం అస్స‌లు వ‌ద‌ల‌కూడ‌దు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వారిని ఏం చేయాలో..!

Comments

comments

Share this post

scroll to top