నిద్రిస్తున్న భ‌ర్త క‌ళ్ల‌లో ఫెవిక్విక్ పోసిన భార్య‌…ఎందుకో తెలుసా..? దానికి ముందు ఏమైంది.? చివరికి ఏమైందంటే?

సంసార‌మన్నాక భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వలు స‌హ‌జం. చిర్రు బుర్రు లాడుకోవ‌డం, మ‌ళ్లీ క‌లిసుండ‌డం అంతా మామూలే. అయితే ఒక్కోసారి దంప‌తుల మ‌ధ్య విభేదాలు మ‌రీ తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. ఆ క్ర‌మంలో ఎవ‌రో ఒక‌రు లేదా ఇద్ద‌రూ ఆవేశ‌ప‌డి తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు కూడా తీసుకుంటుంటారు. దీంతో ఇద్ద‌రూ విడిపోవ‌డ‌మో, విడాకులు తీసుకోవ‌డ‌మో జ‌రుగుతుంది. అయితే ఇలా జ‌రిగితే అంతా బాగానే ఉంటుంది. కానీ త‌న జీవిత భాగ‌స్వామికి శారీర‌కంగా హాని త‌ల‌పెట్టాలని చూస్తేనే వ్య‌వ‌హారం మ‌రింత చెడుతుంది. అది వారిరువురి మ‌ధ్య మరింత వైరాన్ని పెంచుతుంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ స‌రిగ్గా ఇలాగే జ‌రిగింది. ఇద్ద‌రు దంప‌తుల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ కార‌ణంగా భార్య భ‌ర్త‌పై బ‌దులు తీర్చుకునేందుకు చేయ‌కూడ‌ని ప‌ని చేసింది. అనంత‌రం చేతికి చిక్క‌కుండా పారిపోయింది. కాగా భార్య చేతిలో బాధితుడిగా మిగిలిన ఆ భ‌ర్త ప్ర‌స్తుతం హాస్పిట‌ల్‌లో బాగానే ఉన్నాడు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రీవ అనే ప్రాంతంలో ఉన్న సంతోష్‌, విజ‌య‌లక్ష్మిలు దంప‌తులు. వారిరువురికి గ‌త కొంత కాలంగా త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతూ ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఈ నెల 20వ తేదీన రాత్రి పూట య‌థా ప్ర‌కారం వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. అది తారాస్థాయికి చేరుకుంది. ఓ ద‌శ‌లో అది కాస్తా స‌ద్దుమ‌ణిగి ఇద్ద‌రు దంప‌తులు నిద్ర‌కు ఉప‌క్ర‌మించారు. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. అయితే ఆ ఘ‌ట‌న అనంత‌రం విజ‌య‌ల‌క్ష్మికి కోపం న‌శాలానికి ఎక్కింది. ఎలాగైనా త‌న భ‌ర్త‌కు బుద్ధి చెప్పాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలో గాఢ నిద్ర‌లో ఉన్న‌ త‌న భ‌ర్త క‌ళ్ల‌ను తెర‌చి వాటిలో ఫెవిక్విక్ పోసింది. అనంత‌రం అక్క‌డి నుంచి పారిపోయింది.

తెల్ల‌వారు జామున లేవ‌గానే సంతోష్ య‌థావిధిగా క‌ళ్లు తెర‌వాల‌ని ప్ర‌య‌త్నించాడు. కానీ అవి ఎంత‌కూ తెర‌చుకోలేదు. దీంతో అత‌ను ఇరుగు పొరుగు వారిని పిలిచాడు. అక్క‌డికి వ‌చ్చిన వారు ప‌రిస్థితిని గ‌మ‌నించి క‌ళ్ల‌లో ఫెవిక్విక్ ప‌డింద‌ని అత‌నికి చెప్పారు. అనంత‌రం అత‌న్ని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. వైద్యులు ఎంతో క‌ష్ట‌ప‌డి అత‌ని క‌ళ్ల‌ను తెర‌వ‌గ‌లిగారు. అయితే ప్ర‌స్తుతం సంతోష్ ఆరోగ్యంగానే ఉన్నాడ‌ని, క‌ళ్ల‌తో మామూలుగానే చూడ‌గ‌లుగుతున్నాడ‌ని, అత‌నికి ఎటువంటి ప్ర‌మాదం లేద‌ని వైద్యులు చెప్పారు. దీంతో సంతోష్‌తోపాటు అత‌ని బంధువులు, స్నేహితులు ఊపిరి పీల్చుకున్నారు. నిజంగా విజ‌య‌లక్ష్మి లాంటి భార్య‌లు ఏ భ‌ర్త‌కూ ఉండ‌కూడ‌దు క‌దా!

మీడియాతో గోడు వెళ్ల‌బోసుకుంటున్న బాధిత భ‌ర్త సంతోష్ వీడియోను కింద చూడ‌వ‌చ్చు…

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top