భర్త జేబులో భార్య పెట్టిన చీటీ వైరల్ అయ్యింది కదా.! ఆ జంట ఎవరో తెలుసా.? ఆమె అలా రాయడానికి కారణం ఇదే.!

భార్యా భర్తల ను గురించిన జోక్స్ ఎప్పటికప్పుడు కొత్తవి వస్తూనే ఉంటాయి..ప్రతిది నవ్వు తెప్పిస్తూనే ఉంటుంది..నిజంగా భార్య ఏదన్నా చెప్తే అది తీసుకురావడం భర్తకు ఒక సవాలే..తెచ్చాక ఇలా ఎందుకు తెచ్చారు అని గొడవ..సరే నువ్వే తెచ్చుకో అంటే మీరు నాకు హెల్ప్ చేయరా అని అదొక గొడవ.. అలాంటిదే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఏంటంటే భర్తని కూరగాయలు తెమ్మని భార్య రాసిన చీటి..చాలా క్లియర్ గా  టమాటాలు ,బెండకాయలు,పచ్చిమిర్చి కావలసిన వస్తువులు తీసుకురమ్మని రాసిన చీటి.మరింకెందుకు భర్తకు అయోమయం అనుకుంటున్నారా..ఇది ఎవరైనా ఫన్నీ గా రాసి సోషల్ మీడియాలో పెట్టి ఉండొచ్చు ..ఒకసారి మీరు చూస్తే ఆ భర్త పరిస్తితి తలుచుకుని నవ్వాపుకోలేరు..

ఈ ఫోటో అయితే వైరల్ అయ్యింది. ఫేస్బుక్ లో, వాట్సాప్ లో చాలా చోట్ల చూసాము నవ్వుకున్నాము. అసలు ఇంతకీ ఆ జంట ఎవరు అనే డౌట్ వచ్చిందా.? వారి వివరాలు ఇవే.!

పూణే కి చెందిన ఒక వ్యక్తి..తన భార్య ఇచ్చిన ఈ లిస్ట్ ను లింక్డ్ ఇన్ పోర్ఫైల్ లో అప్లోడ్ చేసాడు. కానీ ఇంతలా వైరల్ అవుతుంది అనుకోలేదు వారు. ఆ జంట ఎవరంటే గౌరవ్, ఎరా గౌల్కర్. 10 లక్షల లైకులు, 30 వేల షేర్లు వచ్చేసరికి వారిద్దరూ ఆశ్చర్యపోయారు. మన దేశంలోనే కాదు విదేశాల్లో ఈ పోస్ట్ వైరల్ అయ్యింది అంట. వాస్తవానికి అతనికి చాలా కూరగాయలు తెలియవు అంట. ముఖ్యంగా ఆకుకూరలు వాటి పేర్లు తెలీవు. దానివల్ల చాలా సార్లు మోసపోయి కూరగాయలకు ఎక్కువ డబ్బు చెల్లించి వచ్చేవారంట. 31 ఏళ్ల అతనికి 2014 లో పెళ్లయింది. మొదట్లో అమెరికా లో ఉండేవారు. అక్కడ కూరగాయలు ఆన్లైన్ లో ఆర్డర్ చేసేవారు. కానీ ఇటీవలే ఇండియాలోని పూణే లో సెటిల్ అయ్యారు. భర్త కూరగాయలు తేవడానికి వెళ్తుంటే భార్య లిస్ట్ ఆ విధంగా ఇచ్చింది అన్నమాట. అదండీ! అసలు కథ. ఫోటో వెనక ఇంత స్టోరీ ఉందన్న మాట!

Comments

comments

Share this post

scroll to top