సీఐతో తన భార్య గదిలో ఉండగా…అమెరికాలో ఉన్న భర్త ఎలా కనిపెట్టాడో తెలుసా.? ఇక్కడే అసలు కథ మొదలైంది

అవినీతి నిరోధ‌క‌శాఖ అడిషినల్ ఎస్పీ సునీతారెడ్డి, క‌ల్వ‌కుర్తి సీఐ మ‌ల్లిఖార్జున‌రెడ్డి మధ్య అక్ర‌మ సంబందం సంచ‌ల‌నంగా మారింది., వీరిద్ద‌రి మ‌ధ్య సంభందం నిన్నామొన్నటిది కాదని వీరికి గత ఐదేళ్ల ప‌రిచ‌యం ఉంద‌ని, అది వివాహేత‌ర సంబంధానికి దారి తీసిన‌ట్లు స‌మాచారం. సునీతారెడ్డి భ‌ర్త సురేంద‌ర్‌రెడ్డి ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్నారు. అమెరికాలో ఉండే సునీత భర్త వీరిద్దరిని ఎలా పట్టుకున్నాడు అనే ప్రశ్న అందరికి తలెత్తుతుంది..అయితే అసలు మ్యాటర్లోకి వద్దాం..

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసే ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జున్‌రెడ్డిలను దగ్గర చేసినట్లు తెలిసింది. కేసు దర్యాప్తులో భాగంగా వీళ్లిద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విషయాలు పంచుకునేవరకూ వెళ్లిన వీళ్లిద్దరి పరిచయం ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారితీసింది.అయితే భార్యతో గొడవలున్న మల్లిఖార్జున రెడ్డి,భర్త దూరంగా ఉంటున్న సునీత ఇద్దరి మధ్య గత అయిదేళ్లుగా  సంభందం కొనసాగుతుంది.రెండేండ్ల క్రితం ఈ విషయం తెలిసిన సునీత భర్త సురేందర్ రెడ్డి వీరిద్దరిని నిలదీయడమే కాదు,పెద్దల మధ్య పంచాయితి పెట్టించారు…

అప్పుడు ఇకపైన ఇలాంటి తప్పు జరగదని ,క్షమాపణలు కోరడంతో భార్యపై నమ్మకంతోసర్దుకుపోయాడు సురేందర్ రెడ్డి.తర్వాత కొంతకాలానికి  తిరిగి తను అమెరికా వెళ్లిపోయాడు..అయితే మళ్లీ ఈ మధ్య  హైదరాబాద్ వచ్చిన సురేందర్ రెడ్డికి, సునీత  ఫోన్ ఛాటింగ్స్,అర్దరాత్రిలు ఛాట్ చేయడం ,తనకు తెలియకుండా కాల్స్ మాట్లాడుతుండడంతో భార్య ప్రవర్తన పట్ల మల్లీ అనుమానం రావడంతో..అదే విషయం సునీత వద్ద  ప్రస్తావించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి సురేందర్ రెడ్డి తిరిగి అమెరికా వెళ్లిపోయారు.

ఇక్కడే అసలు కథ మొదలైంది..అమెరికా వెళ్లిపోయాడనుకున్న సురేందర్ రెడ్డి అమెరికా వెళ్లినట్టే వెళ్లి హైదరాబాద్ తిరిగి వచ్చి  భార్యని కాపుకాస్తు ఉన్నారట.అంతేకాదు మూడురోజులుగా మల్లికార్జున్ ,సునీత తన ఇంట్లో కలిసి ఉన్నారన్న విషయం గుర్తించి ఇదే విషయాన్ని బంధువులకు చెప్పారు.. ఆ తర్వాత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం,సునీత తల్లి,పెద్దమ్మ మల్లికార్జున్ ని చెప్పులతో కొట్టడం..మిగతా న్యూస్ అంతా మీడియాలో వచ్చేయడం,వారిద్దరిని ఉద్యోగాలనుండి సస్పెండ్ చేయడం మనకు తెలిసిందే..

Comments

comments

Share this post

scroll to top