భార‌తీయ సినిమాపై ప్రియాంక అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు..!

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి హాలీవుడ్‌లో కూడా స‌త్తా చాటింది ప్రియాంకా చోప్రా. అమెరిక‌న్ టీవీ షో `క్వాంటికో` సిరీస్‌తోపాటు ప‌లు హాలీవుడ్ సినిమాల్లో కూడా ప్రియాంక న‌టించి మెప్పించింది. అయితే హాలీవుడ్‌కు వెళ్లిన త‌ర్వాత ఇండియన్ సినిమా ప్రియాంక‌కు చాలా అల్ప‌మైన‌దిగా క‌న‌బ‌డుతోంది. దీనికి ఆమె చేసిన వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌నం.

ఎమ్మీ అవార్డుల ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్రియాంక‌కు భార‌తీయ సినిమా గురించిన ప్ర‌శ్న ఎదురైంది. దానికి ఆమె స్పందిస్తూ.. `భార‌తీయ సినిమా మొత్తం న‌డుము, పైభాగం చుట్టూనే తిరుగుతుంది. అక్క‌డ ఇలా స్టెప్పులేస్తే స‌రిపోతందం`టూ అక్క‌డే అస‌భ్యంగా నృత్యం చేసింది. దీంతో ప్రియాంక‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. `హాలీవుడ్‌లో ప‌రిప‌తి పెంచుకునందుకు భార‌తీయ సినిమాను ఇంత‌గా అవమానించాలా?` అంటూ ప‌లువురు నెటిజ‌న్లు ప్రియాంక‌ను ప్ర‌శ్నిస్తున్నారు. అయితే ఈ వీడియో ఇప్ప‌టిది కాద‌ని, 2016 ఎమ్మి అవార్డుల వేడుకనాటిద‌ని కొంత‌మంది చెబుతున్నారు. ఎప్ప‌టిదైనా, ఇండియ‌న్ సినిమా గురించి ప్రియాంక ఇంత అస‌భ్యక‌రంగా మాట్లాడ‌డం స‌మంజ‌సం కాద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Comments

comments

Share this post

scroll to top