బైక్ తో 14 దేశాలు…47000 కిలోమీటర్లు చుట్టిన విశాఖ వాసి.

5 ఖండాలు ,14 దేశాలు , 47000 కిలో మీటర్లు,  18 నెలల్లో ప్రపంచాన్ని బైక్ పై చుట్టేసి రికార్డుల్లోకి ఎక్కాడు విశాఖపట్నానికి చెందిన  భరద్వాజ్ దయాల. ఇందులో రికార్డు ఏమిటంటే ప్రపంచ టూర్ కు అతడు వాడింది ఒకటే ఒక బైక్.  అది మనదేశంలో తయారుచేయబడ్డ హీరో వారి కరిజ్మా  బైక్. విదేశాల నుండి స్పోర్ట్స్ బైక్, కొత్త మోడల్స్ తో యమా స్పీడ్ మీదున్న బైకులను కాదని మన ఇండియన్ బైక్ ను వాడి రికార్డు క్రియేట్ చేశాడు  భరద్వాజ్.  2016 ఏప్రిల్ 2 ఆంధ్రపదేశ్ లోని విశాఖపట్నం నుండి తన వరల్డ్ టూర్ యాత్రను మొదలుపెట్టిన భరద్వాజ్ మొదటగా ముంబాయ్ చేరుకున్నాడు.
this-man-completed-a-world-tour-on-an-indian-bike-in-18-months-652x400-3-1444219317
అటు నుండి ఇరాన్ లో ఉన్న టెహ్రాన్ వెళ్ళాడు. అంతర్జాతీయ రహదారుల గుండా వెళుతూ 18 నెలల్లో ఒకటే బైక్ ను ఉపయోగించి,  ఇంతవరకూ మనదేశంలో ఎవరూ చేయని రికార్డును సృష్టించాడు. ఒక బైక్ తో వరల్డ్ టూర్ ను చుట్టేయడమే గగనమనుకుంటే మన దేశంలో తయారు చేయబడ్డ హీరో కరిజ్మా బైక్ పై వరల్డ్ టూర్ చేయడం విశేషం.టెహ్రాన్ నుండి అంతర్జాతీయ రోడ్ మార్గం ద్వారా ఇరాన్, టర్కీ, సిరియా, జోర్డాన్, ఈజిప్ట్, గ్రీస్, ఇటలీ,ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్ డం, కెనడా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇండోనేషియా,బంగ్లాదేశ్ దేశాలను చుట్టేసిన భరద్వాజ్ 2007 అక్టోబర్ 2న తన ప్రపంచ యాత్రను ముగించుకొని విశాఖపట్నం చేరాడు. భరద్వాజ్ దయాల ‘వందే మాతరం’ అనే బైక్ గ్రూప్ ను  నడుపుతోంది. దేశంలోని రాష్ట్రాలను తిరుగుతూ రోడ్ సేఫ్టీ గురించి ఈ టీం ప్రజలకు, బైక్ రైడర్స్ కు చెబుతుంది.
this-man-completed-a-world-tour-on-an-indian-bike-in-18-months-652x400-1-1444219270

Comments

comments

Share this post

scroll to top