భారత దేశంలోనే మొట్ట మొదటి సారిగా గర్భాశయం మార్పిడి ద్వారా పాప కు జన్మనిచ్చిన తల్లి…!

గర్భాశయ మార్పిడి గురుంచి మునుపెన్నడూ విని ఉండరు, కానీ మన భారత దేశం లో మొట్ట మొదటి సారికిగా గర్భాశయం మార్పిడి జరిగింది, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ అప్లైడ్ రీసెర్చ్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ప్రపంచంలోని 15 శాతం మంది మహిళలు వివిధ కారణాల వల్ల తల్లులయ్యే అవకాశం ఉండదు. వాటిలో 3-5 శాతం మందికి గర్భాశయ కారణాలే ఉంటాయి.గుజరాత్‌లోని భరూచ్ ప్రాంతానికి చెందిన మీనాక్షి భారతదేశంలో గర్భాశయ మార్పిడి చేయించుకున్న మొదటి మహిళ. మీనాక్షి గారు మాట్లాడుతూ ”నా వయసు కేవలం 28. ఈ వయసులోనే నాకు మూడు అబార్షన్లు అయ్యాయి. ఇద్దరు పిల్లలు కడుపులోనే మరణించారు. డాక్టర్లు ఇక నాకు పిల్లలు పుట్టరని తేల్చేశారు. కానీ నాకు పిల్లలు కావాలి. అది సరోగసీ ద్వారా కాదు. నాకు పిల్లలను దత్తత తీసుకోవాలని కూడా లేదు, కానీ 17 నెలల క్రితం ఆమె గెలాక్సీ ఆసుపత్రిలో డాక్టర్ శైలేష్ పుంటాంబేకర్‌ను సంప్రదించాక ఆమెలో కొత్త ఆశలు చిగురించాయి. దేవుడంటూ ఉంటే అది డాక్టర్ రూపంలోనే ఉంటాడు. అందుకే మా పాపకు పేరు పెట్టాలని ఆయననే కోరాం” అని మీనాక్షి అన్నారు.

17 నెలలుగా గెలాక్సీలో చికిత్స పొందుతున్న మీనాక్షి అక్టోబర్ 18న సిజేరియన్ అనంతరం ఒక పాపకు జన్మనిచ్చారు. ఆ పాప కేవలం భారతదేశంలోనే కాకుండా, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే మొట్టమొదటిసారి గర్భాశయ మార్పిడి ద్వారా జన్మించిన పాప.మీనాక్షి కి సిజేరియన్ ఆపరేషన్ చేసారు, మీనాక్షికి అమర్చిన గర్భాశయం ఆమె తల్లిదని డాక్టర్ శైలేష్ తెలిపారు. ఆమె తల్లి వయసు 48 ఏళ్లు. ఆ వయసులో గర్భాశయానికి పిండాన్ని మోసే శక్తి ఉండదు. మీనాక్షి తల్లి 20 ఏళ్ల క్రితం గర్భం దాల్చారు. గర్భాశయ మార్పిడి సందర్భంగా కేవలం ఒక్క గర్భాశయాన్ని మాత్రమే మార్చారు. దాంతో పాటు దానికి సంబంధించిన నాళాలను కాదు. ఇలాంటి గర్భాలలో నొప్పులు ఉండవు…మీనాక్షికి ‘ఆషర్‌మ్యాన్ సిండ్రోమ్’ అనే జబ్బు ఉంది. అందువల్ల పాప ఎక్కువ కాలం గర్భాశయంలో ఉండలేకపోయింది. పలుమార్లు అబార్షన్‌లు కావడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. ఇన్ని కారణాల వల్ల డాక్టర్లు సిజేరియన్ చేయవలసి వచ్చింది.ప్రస్తుతం పాప మరియు తల్లి గాలక్సీ హాస్పిటల్ లోనే ఉన్నారు, ఇద్దరి ఆరోగ్యానికి ఎటువంటి ఆపద లేదని గాలక్సీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. మొత్తం ప్రపంచంలోనే ఇప్పటివరకు కేవలం 26 మంది మహిళలకు గర్భాశయ మార్పిడి జరిగితే వాటిలో కేవలం 14 మాత్రం విజయవంతమయ్యాయి. మరికొన్ని మీడియా వార్తల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మార్పిళ్లు 42 జరగగా, వారిలో కేవలం 8 మంది మహిళలు మాత్రం పిల్లలకు జన్మనిచ్చారు.ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ మార్పిడి చాలా అరుదు.గర్భాశయాన్ని ఇచ్చే మహిళ స్వీకరించేవారికి తల్లి కానీ చెల్లి కానీ అత్త కానీ అయి ఉండాలి అని డాక్టర్ శైలేష్ వివరించారు.

మీనాక్షి కూతురికి ‘రాధ’ నామకరణం చేసాడు డాక్టర్ శైలేష్,’రాధ’ భారత దేశంలోనే మొదటి గర్భాశయ మార్పిడి వలన పుట్టిన పాప కావడం ప్రతి ఒక్కరి దృష్టి పాప మీద పడింది. రాధ ఇప్పుడు భారత దేశంలో చిన్నపాటి సీలెబ్రిటీ గా మారిపోయింది. పాప ఆరోగ్యాంగా ఆనందం గా ఉంటే చాలు అని అందరు కోరుకుంటున్నారు.

 

 

Comments

comments

Share this post

scroll to top