“భరత్ అనే నేను” హిట్ అవ్వడానికి కారణాలు ఏంటో తెలుసా.? 6 హైలైట్స్ ఇవే..!

మహేశ్ బాబు,కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.. రెండు రోజుల్లో వందకోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటికి హౌజ్ ఫుల్ కలెక్షన్లతో ముందుకెళుతుంది.పొలిటికల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా.భరత్ అనే నేను అనే డైలాగ్ తో సినిమా రిలీజ్ కు ముందు వచ్చిన యాడ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ఆ సినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు..

  • లండన్లో చదువుకున్న మహేశ్ ఇండియాకు రావడం ఇక్కడ పరిస్థితుల ప్రభావం వలన ముఖ్యమంత్రి కావడం ,పొలిటికల్ మూవీ అయినప్పటికి ఏ పార్టీపై ఎలాంటి డైలాగ్స్ లేకుండా ఆథ్యంతం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.సినిమా చూస్తున్నంత సేపు మనకుకూడా  ఇలాంటి సిఎం ఉంటే బాగున్ను అనే ఊహ ప్రేక్షకులకు రాక మానదు.అంతగా తన పాత్రలో ఒదిగిపోయారు మహేశ్.

  • కొరటాల శివ,మహేశ్ బాబు కాంభినేషన్లో వచ్చిన శ్రీమంతుడు ఎంతపెద్ద హిట్టో మనందరికి తెలిసిందే..ఆ సినిమా తర్వాత వీరి కాంభినేషన్లో వచ్చిన భరత్ అనే నేను కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.ఈ సినిమా సక్సెస్లో వీరిద్దరి కాంబోకి ప్రాధాన్యత ఉంది.
  • కొరటాల మార్క్ డైలాగ్స్ ఎలా ఉంటాయో తెలిసిందే..చాలా చిన్న చిన్న పదాలనే కూర్చి ఒక మంచి డైలాగ్ గా ప్రేక్షకులకు అందిస్తారు..దానికి మంచి ఎక్సాంపుల్ శ్రీమంతుడులోని లావైపోతాం అనే డైలాగ్..ఆ డైలాగ్ జనాల్లోకి ఎంతగా వెళ్లిందంటే ఇఫ్పటికి అందరూ వాడుతూనే ఉంటారు.కొరటాల మార్క్ డైలాగ్స్ ఈ సినిమా సక్సెస్ కు ప్లస్ అయ్యాయి.

కొరటాల మార్క్ డైలాగ్స్ కొన్ని

‘చిన్నప్పుడు మా అమ్మ నాకు ఓ మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్‌ చేసి ఆ మాట తప్పితే యు ఆర్‌ నాట్‌ కాల్డ్‌ ఎ మ్యాన్‌ అని. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మర్చిపోలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్‌ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. పెద్దదే కాదు కష్టమైంది కూడా’..

“కానీ.. ఎంత కష్టమైనా ఆ మాట కూడా తప్పలేదు. బికాజ్‌ ఐ యామ్‌ ఎ మ్యాన్‌ (ఎందుకంటే నేను మనిషిని). విఆర్‌ లివింగ్‌ ఇన్‌ ఎ సొసైటీ (మనం సమాజంలో నివసిస్తున్నాం). ప్రతి ఒక్కళ్లకి  భయం, బాధ్యత ఉండాలి.. ప్రామిస్‌’

” మనుషుల మనసులను చంపేస్తే వచ్చిన డబ్బుతో మీ ఇంట్లో బియ్యం కొనుకుంటే.. అది మీ ఒంటికి పట్టదు… సార్..’

  • సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ హీరోయిన్ కైరా అద్వాని.ధోని సినిమాలో నటించిన కైరా ఈ సినిమాలో సిఎం ని ప్రేమలో పడేసే వసుమతిగా నటించింది.మహేశ్ ,కైరా  మధ్యవచ్చే సన్నివేశాలు,పాటలు కొత్తగా ఉండడమే కాదు బాగున్నాయి.
  • బాహుబలి తర్వాత అంతటి కలెక్షన్లను సాధించిన సినిమా భరత్ అనే నేను..ఈ వేసవిలో కుటుంబంతో కలిసి చూడదగిని మంచి చిత్రం.

Comments

comments

Share this post

scroll to top