భారతీయులు శృంగారంలో కండోమ్ ఎందుకు వాడరో తెలుసా..? అసలు కారణం ఇదే.!

తొడుగు లేదా కండోమ్ శృంగారం సమయంలో పురుషులు ధరించే కుటుంబ నియంత్రణ సాధనం. ఇవి 6-8 అంగుళాల పొడవు, 1-2 అంగుళాల వెడల్పు వుండే ఒక సన్నని రబ్బరు తొడుగు. సంభోగానికి ముందు స్తంభించిన పురుషాంగానికి దీనిని తొడుగుతారు. సంభోగానంతరం పురుషుని వీర్యం ఈ తొడుగులో పడిపోయి చివరన వుండిపోతుంది. అందువల్ల వీర్యకణాలు స్త్రీ గర్భకోశంలో ప్రవేశించే అవకాశం లేదు.


గడిచిన మూడు దశాబ్దాల్లో, ఇండియాలో లైంగిక వ్యాధులు 400 శాతం పెరిగాయంటే నమ్మగలరా..కానీ ఇది వాస్తవం. కండోమ్స్ వాడకపోవడం వలన ఇండియాలో ఈ తరహా రోగాలు దారుణంగా పెరిగిపోయాయి. ఒక కండోమ్ బ్రాండ్ ఇటీవల నిర్వహించిన సర్వేలో 95శాతం మంది భారతీయ మగవారు కండోమ్స్ అసలు వాడరని తేలింది. ఈ సర్వే ఫలితాల్ని ఆ కంపెనీ ఇలా వెలువరించిందో లేదో, ‘ఇండియా హేట్స్ కండోమ్స్’ అన్న హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ఫుల్ ట్రెండింగ్ అయిపోయింది. మెమేలు, జోకులు వేసుకుంటూ నెటిజన్లు పండగ చేసుకున్నారు.


అసలు ఇంతకీ భారతీయులు కండోమ్స్ ఎందుకు ఇష్టపడరు..?సర్వేలో చాలా మంది చెప్పిన మాట, కండోమ్స్ వాడితే మూడ్ తగ్గిపోతోంది అని. కేవలం మగవారే కాక, స్త్రీలు కూడా కండోమ్ వాడితే ఆ ఫీల్ ఉండట్లేదంటూ చెప్పడం గమనార్హం. కొంతమంది కండోమ్ నుంచి వచ్చే రబ్బర్ వాసనకు తమకు మూడ్ ఆఫ్ అవుతోందని సర్వేలో చెప్పారట. ముఖ్యంగా మొట్టమొదటిసారి కండోమ్ ధరించేవారికైతే, కనీసం శృంగారంలో ముందుకెళ్లే ధైర్యం కూడా రావట్లేదట. విచిత్రంగా ఉన్నా, ఇండియాలో కండోమ్ వాడకం తక్కువగా ఉండటానికి ఇవన్నీ కూడా కారణాలే.


ఇక అన్నింటి కంటే ముఖ్యమైన కారణం, షాపు కు వెళ్లి కండోమ్స్ కొనుక్కోవడానికి సిగ్గు. రోడ్డు పక్కన ట్యాంక్ ఖాళీ చేయడానికి ఏమాత్రం సిగ్గుపడని భారతీయ మగధీరులు, షాప్ కు వెళ్లి కండోమ్స్ కొనుక్కోవాలంటే మాత్రం మహా సిగ్గు పడిపోతారట.మరి పరిష్కారమేంటి అని అంటే, ఏటీఎంలా కండోమ్స్ కు కూడా మెషీన్లు పెట్టాలని సూచిస్తున్నారు కొంతమంది నెటినన్లు. తద్వారా, షాపుకెళ్లి అడిగి కొనుక్కుని ఇబ్బంది పడేబదులు, ఎవరికి వాళ్లు స్వేచ్ఛగా ఏటీఎంలో డబ్బులు తీసుకున్నట్టుగా కండోమ్స్ తీసేసుకోవచ్చు కదా అంటున్నారు.
అయినా అసలు సమస్య కండోమ్స్ కొనుక్కోవడం దగ్గర కాదు, వాడటం దగ్గరే వస్తోంది. అది తీరితే, అనేక లైంగిక వ్యాధుల్ని సంక్రమించకుండా అరికట్టవచ్చు.

Comments

comments

Share this post

scroll to top