చివరిసారిగా “భరత్” తన స్నేహితుడికి ఫోన్ చేసి ఏం మాట్లాడాడో తెలుసా..?

హీరో రవితేజ తమ్ముడు భరత్‌ మృతి కేసులో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన మద్యం సేవించి కారు నడిపినట్టు వెల్లడైంది. ప్రమాదానికి ముందు ఆయన నోవాటెల్‌ హోటల్‌లో గడిపిన దృశ్యాలు సీసీ కెమెరా రికార్డయ్యాయి. శనివారం ఆయన నోవాటెల్‌లో స్నేహితుడి పుట్టినరోజు పార్టీకి హాజరయ్యారు. సాయంత్రం 4 గంటలకు స్విమ్మింగ్‌పూల్‌ వద్ద ఆయన మద్యం సేవించినట్టు సీసీ కెమెరా దృశ్యాల్లో కనిపించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9.25 గంటల వరకు ఆయన నోవాటెల్‌లో ఉన్నారు. భరత్ అంత్యక్రియలకు కూడా హాజరు కానీ రవితేజ, ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు వీలైనంత దూరంగా ఉంటున్నారు. కానీ భరత్ స్నేహితులు మాత్రం భరత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

కొద్ది రోజుల ముందు భరత్ తన స్నేహితుడు “సత్యదేవ్‌”కు ఫోన్ చేశాడు. తాగుడు మానేయాలి అనుకుంటున్నాను అని చెప్పాడంట. అందుకోసం తనను బెంగళూరుకు తీసుకెళ్లి, అక్కడున్న ప్రముఖ రీహ్యాబిటేషన్ సెంటర్‌లో చేర్పించాలని సత్యదేవ్‌ను కోరాడంట… ఈ విషయాన్ని సత్యదేవ్ వివరించారు. ‘‘నేను మందు తాగడం కాదు.. మందే నన్ను తాగేస్తోంది’’ అని భరత్ తనతో ఆఖరి మాట మాట్లాడారని సత్యదేవ్ తెలిపారు. భరత్‌కు ఎన్ని దురలవాట్లు ఉన్నా వ్యక్తిగతంగా చాలా మంచివాడని సత్యదేవ్ చెప్పాడు.మద్యానికి, డ్రగ్స్ కు బానిసైన భరత్ కు ఆ దురలవాట్ల నుంచి బయటపడమని తాను తరచుగా చెబుతుండేవాడినని అన్నారు.

 

Comments

comments

Share this post

scroll to top